కాచిగూడ, ఆగస్టు 8: 75 ఏండ్ల స్వాతంత్య్ర సంబురాలను పురస్కరించుకుని కాచిగూడలోని తుల్జాభవన్‌లో ఆదివారం కరాటేలో బ్లాక్ బెల్ట్ అయిన 70 యేండ్ల వృద్ధుడు సాహసోపేతమైన విన్యాసాలను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. వరల్డ్ రికార్డ్సు ప్రతినిధుల సమక్షంలో ఏడు నిమిషాల్లో పగులగొట్టాల్సిన 75 బండరాళ్లను కేవలం మూడు నిమిషాల 20 సెకన్లలో పగులగొట్టి కరాటేలో నిపుణులచే వారెవ్వా.. అనిపించుకున్నారు.
వైద్య వృత్తి లో పట్టా పొందినప్పటికీ విన్యాసాలు చేసి ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు’లో స్థానం సంపాదించుకున్నారు సైదాబాద్‌కు చెందిన డాక్టర్ కృష్ణారెడ్డి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడానికి ఆదివారం నిర్వహించిన సాహసోపేతమైన కరాటే విన్యాసాలను పరిశీలనకు పంపిస్తున్నట్లు కరాటే మాస్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో బింగి నరేందర్ గౌడ్, దేవిరెడ్డి విజితారెడ్డి, ఎడ్ల నరేందర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ చైర్మన్ కొత్త నిరంజన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది మాణిక్ ప్రభు, సూర్యప్రకాశ్, కరీం, నర్సింగరావు, అమృత, విప్లవ్, డాక్టర్ హరిత, గౌతమ్, పవన్ తేజ, ఘన సంతోష్, యోగిని, జానకి పాల్గొన్నారు.