బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Jul 17, 2020 , 23:25:29

పెద్దన్న పెండ్లి కానుక కల్యాణలక్ష్మి

పెద్దన్న పెండ్లి కానుక కల్యాణలక్ష్మి

హైదర్‌నగర్‌, జూలై 17 : పేదింట పెండ్లి ఖర్చులను భరించాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ పెద్దన్నలా నిలుస్తున్నాడని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పేదిండ్లలో కల్యాణ కాంతులు నెలకొంటున్నాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన పథకాల ఆర్థిక సాయాన్ని శుక్రవారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో లబ్ధిదారులకు అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో యాదగిరి, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాసగౌడ్‌, లక్ష్మారెడ్డి, సైదేశ్వర్‌, ప్రసాద్‌, పోతుల రాజేందర్‌, అష్రాఫ్‌ పాల్గొన్నారు.


logo