e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ తాగునీటి పైపులైన్‌ పనులు ప్రారంభం

తాగునీటి పైపులైన్‌ పనులు ప్రారంభం

తాగునీటి పైపులైన్‌ పనులు ప్రారంభం

అంబర్‌పేట, మే 18 : అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. నల్లకుంట డివిజన్‌లోని క్షత్రీయ టవర్స్‌ వద్ద రూ. 5.50లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న తాగునీటి పైపులైన్‌ పనులను కార్పొరేటర్‌ అమృతతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రెండున్నరేండ్ల కాలంలో కోట్లు వెచ్చించి రోడ్లు, తాగునీటి, డ్రైనేజీ పైపులైన్‌ పనులు, వర్షపునీటి పైపులైన్‌ పనులు, పుట్‌పాత్‌ల ఆధునీకరణ, పార్కుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా ప్రధాన రహదారులను అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నాలాల ఆధునీకరణ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి జీఎం మహేశ్‌, డీజీఎం సన్యాసిరావు, మేనేజర్‌ శేఖర్‌, జీహెచ్‌ఎంసీ డీఈ సుధాకర్‌, ఏఈ శ్వేత, బీజేపీ నాయకులు మధుయాదవ్‌, సురేశ్‌యాదవ్‌, మహేశ్‌, లక్ష్మణ్‌, క్రాంతి పాల్గొన్నారు.

డ్రైనేజీ పైపులైన్‌ పనులు ప్రారంభం..

బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని తురాబ్‌నగర్‌లో రూ. 20లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్‌ పనులను డివిజన్‌ కార్పొరేటర్‌ పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పనులు పూర్తయితే తురాబ్‌నగర్‌ వాసులకు డ్రైనేజీ సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో డీజీఎం సతీశ్‌, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి, కృష్ణాగౌడ్‌, సురేశ్‌, జె.బాలరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీరాములు ముదిరాజ్‌, శివాజీయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తాగునీటి పైపులైన్‌ పనులు ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement