మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 25, 2020 , 12:38:10

పేదలను ఆదుకునేందుకే సాయం

పేదలను ఆదుకునేందుకే సాయం

బంజారాహిల్స్‌: వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలను ఆదుకునేందుకే కుటుంబానికి రూ.10వేల చొప్పున వరద సాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. శనివారం రహ్మత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందజేశారు.  జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బందితో కూడా బృందాలు అన్ని బస్తీల్లోకి వెళ్లి సాయాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ సాయం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని బాధితులందరికీ సాయం అందుతుందని చెప్పారు. పేదలకు సాయం అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సీఎన్‌ రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు నాగరాజు, షరీఫ్‌, మన్సూర్‌, ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

 వెంగళరావునగర్‌ డివిజన్‌లో.. 

వెంగళరావునగర్‌: డివిజన్‌ పరిధిలో వరద బాధితుల ఇంటింటికీ తిరిగి ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయాన్ని శనివారం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అందజేశారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నియోజవర్గంలో నష్టపోయిన బాధితులకు ప్రతిఒక్కరికీ సాయం అందిస్తామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.550 కోట్లు కేటాయించారన్నారు. ప్రభుత్వం పేదల పక్షపాతి అని పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు దేదీప్యరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

షేక్‌పేట్‌ డివిజన్‌లో.. 

షేక్‌పేట్‌: ప్రజలకు ఆదుకుంటున్న అసలుసిసలు నేత సీఎం కేసీఆర్‌ అని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. శనివారం షేక్‌పేట్‌ డివిజన్‌లో హకీంషాకాలనీలో వరద బాధితులకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు చెరక మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.