శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 23:20:19

జయహో.. జయశంకర్‌

జయహో.. జయశంకర్‌

నీ సేవలు మరువలేనివి

తెలంగాణ సిద్ధాంత కర్తకు ఘన నివాళి

తొలి, మళిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహానీయుడు జయశంకర్‌ సార్‌ అని వక్తలు కొనియాడారు. తెలంగాణ సిద్ధాంత కర్తను నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సార్‌ 83వ జయంతి సందర్భంగా వాడవాడలా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సార్‌ కలలు కన్న బంగారు తెలంగాణ సాకారమే 

ధ్యేయంగా ముందుకుసాగుతామని ప్రతినబునారు..

హైదర్‌నగర్‌/కేపీహెచ్‌బీ కాలనీ/బాలానగర్‌/ఖైరతాబాద్‌/హిమాయత్‌నగర్‌/వెంగళరావునగర్‌/ఎర్రగడ్డ : యావత్‌ తెలంగాణ సమాజం జయశంకర్‌ సార్‌ ఉద్యమ స్ఫూర్తిని, ఆయన సేవలను ఎన్నటికీ మరువబోదని ప్రభుత్వ విప్‌ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 83వ జయంతి కార్యక్రమాన్ని  గురువారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సార్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణకు సార్‌ దిక్సూచి అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవతమంతా పాటుపడ్డారని గాంధీ పేర్కొన్నారు. సార్‌ ఆశయ సాధనకై బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ వెంట ప్రజలంతా అడుగులేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్‌, గౌతమ్‌ గౌడ్‌, కాశీనాథ్‌యాదవ్‌, సైదేశ్వర్‌, ఉమ ప్రభాకర్‌, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ కార్యాలయంలో జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ సార్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మబండలో కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌ సార్‌ కాంస్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో దొడ్ల రామకృష్ణ గౌడ్‌, కాశీనాథ్‌యాదవ్‌, దేవేందర్‌, మురళీ, మహేశ్‌, మున్నా, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

కూకట్‌పల్లి జోన్‌ కార్యాలయ ఆవరణలో మూసాపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవికుమార్‌, కూకట్‌పల్లి సర్కిల్‌ ఉప కమిషనర్‌ వి.ప్రశాంతి జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈఈలు శంకర్‌ నాయక్‌, నాగేందర్‌ యాదవ్‌, ఏఎంహెచ్‌వోలు చంద్రశేఖర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, ఏఎంసీలు, సిబ్బంది పాల్గొన్నారు. 

కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ మాజీ అధ్యక్షుడు జనగాం సురేశ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి, రాజు, నర్సింహులు పూలమాల వేసి నివాళులర్పించారు. 

అల్లాపూర్‌ పర్వత్‌నగర్‌లో జయశంకర్‌ సార్‌ విగ్రహానికి కార్పొరేటర్‌ సబీహాబేగం, మూసాపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవికుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లాపూర్‌ వార్డు కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్‌ సార్‌కు నిమ్స్‌ దవాఖానలో నివాళులర్పించారు. డైరెక్టర్‌ డాక్టర్‌ కె. మనోహర్‌, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణారెడ్డి, పారామెడి కల్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌, ఎస్‌.శ్రీనివాసులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఇందిరానగర్‌లో ప్రొ.జయశంకర్‌ చిత్రపటానికి హిమాయత్‌నగర్‌ వార్డు కమిటీ సభ్యుడు డి.రాజేందర్‌కుమార్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. 

యూసుఫ్‌గూడ మొదటి బెటాలియన్‌లో కమాండెంట్‌ ఎ.కె.మిశ్రా, అడిషనల్‌ కమాండెంట్‌ టి.గంగారాం, అసిస్టెంట్‌ కమాండెంట్‌, బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది కలిసి సార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఎర్రగడ్డ: బోరబండ సైట్‌-3లోని జయశంకర్‌ కమ్యూనిటీహాల్లో పార్టీ కార్యకర్తలు సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్‌ అధ్యక్షుడు కృష్ణమోహన్‌, సీనియర్‌ నేతలు, వార్డుకమిటీ సభ్యులు, బస్తీల నాయకులు పాల్గొన్నారు. రహ్మత్‌నగర్‌, ఎర్రగడ్డ డివిజన్లలో కూడా సార్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు.

బాలానగర్‌ : ఫిరోజ్‌గూడలో ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ చిత్రపటానికి కార్పొరేటర్‌ నరేంద్రాచార్య పూలమాల వేసి నివాళులర్పించారు. బాలానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మందడి సుధాకర్‌రెడ్డి, పాల్గొన్నారు.