బుధవారం 24 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 23, 2021 , 06:20:56

కరీంనగర్‌ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది

కరీంనగర్‌ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది

కరీంనగర్‌ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది. మంత్రి కేటీఆర్‌ చూపిన చొరవతో స్థానికంగానే 3,600 మంది యువతకు కొలువులు దొరకనున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించి.. ఎక్కడి యువతకు అక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌లో ప్రారంభమైన ఐటీ టవర్‌లో 18 కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఇండస్‌, వీసీఆర్‌, బీటా, అర్బన్‌ టెక్‌ కంపెనీలు.. తమ అవసరాలకు మేరకు రిక్య్రూట్‌ చేసుకొని సేవలు ప్రారంభించాయి. మిగిలిన కంపెనీలు సైతం ఫిబ్రవరిలో తమ అవసరాలకు తగినట్లుగా రిక్య్రూట్‌మెంట్‌ చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఒక్కో షిప్టునకు 1200 మంది చొప్పున మొత్తం మూడు షిప్టుల్లో 3,600 మంది ఈ టవర్‌లో పనిచేసే అవకాశం ఉందని, ఆ మేరకు రిక్య్రూట్‌మెంట్లు జరుగుతాయని టీసీ ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ అజ్మీరా స్వామి తెలిపారు.

VIDEOS

logo