బుధవారం 12 ఆగస్టు 2020
Hyderabad - Jul 07, 2020 , 23:38:38

భవిష్యత్‌ తరాలకోసం మొక్కలు నాటాలి

భవిష్యత్‌ తరాలకోసం మొక్కలు నాటాలి

శ్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,యెగ్గె మల్లేశం

ఎల్బీనగర్‌, జూలై 7: భారతదేశంలోనే అద్భుతమైన ప్రమాణాలతో ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ఫతుల్లగూడలో మూడు మతాల వారి కోసం శ్మశాన వాటికలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా నాగోలు డివిజన్‌ ఫతుల్లగూడలో మూడు మతాల శ్మశాన వాటిక స్థలంలో  ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ, కార్పొరేటర్‌ చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు మతాలకు పక్క పక్కనే గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఇండియా వారి మార్గదర్శకాల ప్రకారం శ్మశాన వాటికలను అధునాతనంగా నిర్మించనున్నామన్నారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు.  కార్యక్రమంలో   టీఆర్‌ఎస్‌  సీనియర్‌ నాయకుడు, ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తతో పాటుగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు, హెచ్‌ఎండీఎ అధికారులు పాల్గొన్నారు. 


logo