చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం తొలుత తగ్గించి.. ఆ వెంటనే పెంచేసింది. దీంతో ఇవ్వాళ కాకపోయినా సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఈ నేపథ్యంలో సగటున 8శాతం వడ్డీ చొప్పున ఉన్న ఈ పథకాల్లో పొదుపును పరోక్షంగా ప్రభుత్వం ఇకపై ప్రోత్సహించకపోవచ్చు. పన్ను రాయితీల వంటివి కూడా తొలగించే అవకాశం లేకపోలేదు. మరోవైపు తక్కువ రిస్క్‌ను ఆశించి పొదుపు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై కూడా వడ్డీరేటు అంతంత మాత్రంగానే ఉన్నది. ఈ నేపథ్యంలో కాస్త రిస్క్ ఉన్నా.. అంతకన్నా ఎక్కువ రాబడి వచ్చే సాధనాల్లో ఇక నుంచి పొదుపు చేయడం ఉత్తమం. కాబట్టి ఈ వారం మనం ఎఫ్‌డీల కన్నా డెట్ మ్యూచువల్ ఫండ్లు ఏ రకంగా బెటరో తెలుసుకుందాం.
డెట్ మ్యూచువల్ ఫండ్లే ఎందుకు
దశాబ్దాలుగా ఫిక్స్డ్ డిపాజిట్లకున్న ఆదరణ.. ఇప్పుడు వడ్డీ తగ్గడం కారణంగా పడిపోతున్నది. ఇదే సమయంలో ఎఫ్‌డీల్లో లేని లిక్విడిటీ, అధిక రాబడి, పన్ను రాయితీ వంటి అదనపు ఆకర్షణలు డెట్ మ్యూచువల్ ఫండ్లు ఆఫర్ చేస్తున్నాయి. దీనికితోడు టాక్స్ సేవింగ్స్ ఫండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మదుపు చేసిన కాలానికి స్థిరంగా ఆదాయాన్ని అందించడమే డెట్ ఫండ్ల లక్ష్యం. ఇక ఎఫ్డీలలో మాదిరిగా ఏకమొత్తంగా మదుపు చేయాల్సిన అవసరం లేదు.
ఎఫ్డీ-డెట్ ఫండ్
ఎఫ్డీలు 6 నుంచి 8 శాతం రాబడిని ఇస్తే.. డెట్ ఫండ్లలో 9 నుంచి 10 శాతం లాభం ఉంటుంది. డెట్ ఫండ్లలో అదనంగా డివిడెండ్ ఆప్షన్ ఉంటుంది. లిక్విడిటీ కూడా ఎక్కువే. అంటే అత్యవసరాల్లో ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు.
పన్ను రాయితీ
ఎఫ్‌డీల కన్నా డెట్ ఫండ్లలో వచ్చే రాబడిపై రాయితీ ఎక్కువ. ఉదాహరణకు రెండింటిలోనూ రెండేసి లక్షల రూపాయలను పొదుపు చేశారనుకుందాం. రెండింటిలోనూ సమానంగా 7శాతం రాబడి అలాగే మూడేండ్ల కాలపరిమితి ఉందనుకుందాం. అప్పుడు ఎఫ్డీలపై రూ.13,500 పన్ను చెల్లించాల్సి వస్తే, డెట్ ఫండ్లలో రూ.4,906 చెల్లిస్తే చాలు. పన్ను చెల్లింపు తర్వాత రాబడి డెట్ ఫండ్లలో రూ.40,094గా ఉంటే, ఎఫ్డీలలో రూ.31,500.
ఇవీ కూడా చదవండి…
ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ఇస్తే సరి.. పీఎఫ్ ఖాతా వివరాలు రెడీ
గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ యూసేజీ అంత వీజీకాదు.. ఎందుకంటే!
వేదాంత కెయిర్న్‌తో జగడం.. లాభాల రికవరీకి కేంద్రం నోటీసు