e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ వ్యాధి ముసిరితే..దారి చూపింది

వ్యాధి ముసిరితే..దారి చూపింది

వ్యాధి ముసిరితే..దారి చూపింది
 • చర్చిలోనే కొవిడ్‌ వసతులు..
 • కల్వరీ టెంపుల్‌లో 300 పడకలతో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు
 • పాజిటివ్‌ వచ్చిన వారికే అనుమతి..
 • 12 మంది వైద్యులు, 30 మంది నర్సులతో 24 గంటలు సేవలు

మాదాపూర్‌, మే 8: వ్యాధులు, బాధలు ముసిరిన వేళ..కరోనా వైరస్‌ కోరలు చాచిన వేళ.. నగరానికి చెందిన క్రైస్తవుల ప్రార్థనా నిలయం కల్వరీ టెంపుల్‌ మానవతా దారులను చూపింది. విపత్తులో రోగులకు బాసటగా నిలిచింది. వైరస్‌ సోకిన వారికి చికిత్సనందించేందుకు చర్చిలోనే ఏర్పాట్లను చేసింది. నిరుడు లాక్‌డౌన్‌ సమయంలో అన్నదానం చేసి ఎంతో మందికి అండగా నిలిచిన మియాపూర్‌లోని కల్వరీ టెంపుల్‌ ఈ సారి అంతకుమించి సేవకు ముందుకొచ్చింది. 300 పడకలు, 50 ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేసి కొవిడ్‌ రోగులకు అందుబాటులో ఉంచింది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పేరిట అంకురా, ధెరిస్సా వైద్యశాలల సౌజన్యంతో కొవిడ్‌ సెంటర్‌ పేరిట కల్వరీ టెంపుల్‌ వ్యవస్థాపకుడు సతీశ్‌కుమార్‌ ఏర్పాటు చేసిన ఈ వసతిని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, విప్‌ అరెకపూడి గాంధీ, మియాపూర్‌, హైదర్‌నగర్‌ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్‌, నార్నె శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.

కల్వరీ సేవలు ప్రశంసనీయం

 • కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
 • విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి తనవంతు సాయం చేయాలనే ఉద్దేశంతో కల్వరీ టెంపుల్‌ వ్యవస్థాపకుడు సతీశ్‌కుమార్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని కొనియాడారు.
 • గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో 40 వేల మందికి 35 నుంచి 40 రోజుల వరకు నిత్యావసరాలు అందించి ఆదుకున్నారన్నారు.
 • ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా కొవిడ్‌ సమయంలో కల్వరీ టెంపుల్‌ ఆధ్వర్యంలో అనేక సేవలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.
 • అంతేకాక కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏడు వైద్యశాలలతో ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.

12 మంది వైద్యులు, 30 మంది నర్సులు

 • కొవిడ్‌ రోగులను 12 మంది వైద్యులు, 30 మంది నర్సులు 24 గంటల పాటు పర్యవేక్షిస్తుంటారని కల్వరీ టెంపుల్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సతీశ్‌కుమార్‌ పేర్కొన్నారు.
 • గత సంవత్సరం లాక్‌డౌన్‌ విధించినప్పుడు 800 టన్నుల ఆహార పదార్థాలను పంపిణీ చేశామన్నారు.
 • తినడానికి తిండి లేని వారికి 35 నుంచి 40 రోజుల పాటు నిత్యావసరాలు అందించామని వివరించారు.
 • తెలంగాణ, ఆంధ్రలో ఉన్న 8 కల్వరీ టెంపుళ్లలో ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

బీపీ, షుగర్‌ ఉంటే..చేర్చుకోలేం

కల్వరీ టెంపుల్‌లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌లో చేరిన కరోనా రోగులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటాం. అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, స్నాక్స్‌, రాత్రి భోజనం అందించే ఏర్పాట్లు చేశాం. ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలో రోగులకు అవగాహన కల్పిస్తున్నాం. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో కొవిడ్‌ రోగులను ఉంచి నయం అయ్యే వరకు సేవలు చేయాలని నిర్ణయించాం. బీపీ, షుగర్‌ ఉన్న వారిని ఇక్కడ చేర్చుకోవడం లేదు. ఎందుకంటే ఇతర వ్యాధులు ఉన్నవాళ్లకు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందాలి తప్ప కేవలం ఐసోలేషన్‌ సేవలు సరిపోవు. పాజిటివ్‌ వచ్చి ఇంట్లో ఉండలేని వారిని మాత్రమే ఇక్కడ చేర్చుకుంటున్నాం. – రాజేశ్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఇన్‌చార్జి

ఈ విపత్తులో..మనకు తోచిన సాయం చేద్దాం

 • కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
 • పాజిటివ్‌ వచ్చిన వారందరికీ ఉచితంగా మందులు, ఆక్సిజన్‌ అందిస్తున్నామని చెప్పారు.
 • కరోనా విజృంభిస్తున్న క్లిష్ట సమయాల్లో ప్రతిఒక్కరూ తమకు తోచిన ఏదో ఒక సాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
 • ఈ విషయంలో కల్వరీ టెంపుల్‌ వ్యవస్థాపకుడు సతీశ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
 • వారు చేస్తున్న సేవల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.
 • మాస్కులు ధరించాలని, తరచుగా చేతులను శానిటైజ్‌ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని వివరించారు.
 • కల్వరీ టెంపుల్‌ ఆధ్వర్యంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు 300 పడకలు, 50 ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.

24 గంటలు సేవలు..

 • కొవిడ్‌ రోగులు పాజిటివ్‌ రిపోర్టు చూపితే కల్వరీ టెంపుల్‌లోని ఐసొలేషన్‌లో ఉండేందుకు అనుమతి ఇస్తారు.
 • ఈ ఐసొలేషన్‌లో రెండు వార్డులను ఏర్పాటు చేశారు.
 • ఈ వార్డులు 24 గంటలూ పని చేయనున్నాయి.
 • రెండు షిఫ్టుల్లో మొత్తం 12 మంది వైద్యులు, 30 మంది నర్సులు సేవలు అందించనున్నారు.
 • అంతేకాక కొవిడ్‌ రోగులకు సేవలు అందించేందుకు 40 మంది ఆయాలను నియమించారు.
 • ఇందులో కౌన్సిలింగ్‌, రిసెప్షన్‌, అడ్మిషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
 • కొవిడ్‌ రోగులకు ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్‌, నిమ్మరసం, స్నాక్స్‌, డ్రైఫూట్స్‌, డిన్నర్‌ అందివ్వనున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యాధి ముసిరితే..దారి చూపింది

ట్రెండింగ్‌

Advertisement