గురువారం 28 జనవరి 2021
Hyderabad - Jun 15, 2020 , 23:36:26

తాగునీటిపై ఇంత నిర్లక్ష్యమా?

తాగునీటిపై ఇంత నిర్లక్ష్యమా?

   పైపులైన్‌ పగిలి నీరు పోతున్నా పట్టించుకోరా

   అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

బషీర్‌బాగ్‌ : ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో తాగునీటి పైపులైన్‌ పగిలిపోయి రోడ్డుపై ప్రవహిస్తున్న  తాగునీటిని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ సోమవారం పరిశీలంచారు.  శిథిలావస్థకు చేరిన పైపు పగిలిపోవడంతో తాగునీరు రోడ్డుపై వృథాగా పోతున్నదని గమనించి, తాగు నీరు రోడ్డుపై వృథాగా పోతే పట్టించుకోరా? అని అధికారులను నిలదీశారు. తక్షణమే పైపులైన్‌కు మరమ్మతులు చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆయన  జలమండలి అధికారులను ఆదేశించారు.  నాయకులు బల్లా ప్రశాంత్‌ కుమార్‌, మహంకాళి ఆలయ పూజారి చంద్రమౌళి, రాజు, షాహెద్‌, ప్రభాకర్‌, ఆర్‌. శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

 కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి..

 కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్‌లోని మహంకాళి ఆయలంలో హిదాయత్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షాహెద్‌ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నివారణలో భాగంగా శానిటైజేషన్‌ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా బారిన పడకుండా శానిటైజేషన్‌ మిషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాంబశివరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్‌, ఎయిర్‌టెల్‌ రాజు, శ్రీధర్‌చారి, బల్లా ప్రశాంత్‌ కుమార్‌, ఆర్‌. శ్రీనివాస్‌, గంటల రాజు, లక్ష్మణ్‌, మాదేశి రాజేందర్‌, సదా తదితరులు పాల్గొన్నారు. 


logo