జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి కోవిడ్ అని తెలియగానే అభిమానులు, కుటుంసభ్యులు కంగారు పడ్డారు. తమ దేవుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలువురు రకరకాల కామెంట్లతో అభిమానులకు కోపం తెప్పిస్తున్నారు. అలా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన వారిలో ప్రముఖ హేతువాది బాబుగోగినేని కూడా ఉన్నారు.
పవర్ స్టార్ ని పరామర్శిస్తున్న వివేకానందుడు, చెగువేరా అంటూ ఓ అభిమాని డిజైన్ చేసిన ఫోటో పై ఆయన చేసిన కామెంట్లు అభిమానులను హర్ట్ చేశాయి. కార్టూన్ లా ఉందంటూ హేళనగా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు మెగా బ్రదర్ నాగబాబు వరకు వెళ్లాయి. ఆయన తనదైన స్టైల్లో విమర్శించారు. ఇలాంటివి ఫార్వాడ్ చేయకండయ్యా. నాకు కేవలం పెంపుడు కుక్కలంటేనే ఇష్టమని ట్వీట్ చేశారు. ఈ కామెంట్ పవర్ స్టార్ అభిమానుల్లోజోష్ నింపింది. గోగినేని ఊరకుక్కతో పోల్చుతూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అంతేకాదు ఇంకోసారి మా హీరోపై తప్పుడు కూతలు కూస్తే డాష్ డాష్ అంటూ కొందరు బీభత్సంగానే వార్నింగ్ లు ఇచ్చారు.