శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Aug 23, 2020 , 23:52:48

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

 టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

ఎర్రగడ్డ: అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ అన్నారు. బోరబండ డివిజన్‌ వినాయకరావునగర్‌కు చెందిన యువనేత రాజశేఖర్‌ తన అనుచరులతో కలిసి డిప్యూటీ మేయర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు వేసి బాబా ఫసియుద్దీన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం రాత్రి వినాయకరావునగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ బోరబండలో దశాబ్దాలుగా తిష్ఠ వేసిన దీర్ఘకాలిక సమస్యలు కేవలం ఐదేండ్లలో ఆచరణకు నోచుకున్నాయని తెలిపారు. దీంతో డివిజన్‌లోని అన్నివర్గాల ప్రజలు గులాబీ చెంతకు వస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కృష్ణమోహన్‌, బస్తీ అధ్యక్షుడు ఆనంద్‌, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.