శనివారం 23 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 10:05:23

విద్యార్థి వద్ద మత్తు పదార్థం స్వాధీనం

విద్యార్థి వద్ద మత్తు పదార్థం స్వాధీనం

హైదరాబాద్‌ : హషీష్‌ మత్తు పదర్థాన్ని సరఫరా చేస్తున్న ఓ బీటెక్‌ విద్యార్థిని శుక్రవారం రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బీరంగూడకు చెందిన వీరాపల్లి లక్ష్మీపతి విద్యను మధ్యలో వదిలేసి మత్తుకు బానిసయ్యాడు. హషీష్‌ గురించి తెలసుకున్న లక్ష్మీపతి దాని సరఫరాకు సిద్ధయ్యాడు. శుక్రవారం పెద్దఅంబర్‌పేట్‌ వద్ద రెండు లీటర్ల హషీష్‌తో ఉన్నాడని సమాచారం తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌కుమార్‌ బృందం అతనిని అదుపులోకి తీసుకుంది. అతని రూ.2 లక్షల విలువ చేసే హషీష్‌ లభించిందని తెలిపారు. వైజాగ్‌కు చెందిన నగేశ్‌, బీరంగూడకు చెందిన మోహన్‌రెడ్డి ఈ దందాను చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కాగా వారిద్దరు పరారీలో ఉన్నారు.


logo