గురువారం 28 జనవరి 2021
Hyderabad - Oct 01, 2020 , 07:02:51

కరోనాపై అవగాహనకు రైల్వే అధికారుల వినూత్న ప్రచారం

కరోనాపై అవగాహనకు రైల్వే అధికారుల వినూత్న ప్రచారం

విస్తృతంగా గోడలపై వాల్‌ పెయింటింగ్‌లు 

చూపరులను ఆకట్టుకుంటున్న రైల్వే అధికారుల ప్రచారం

సికింద్రాబాద్‌: కరోనాను నిర్మూలించేందుకు రైల్వే అధికారులు విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా రైల్వే కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ రైల్వే స్థలాలు, పలు భవనాలు, క్వార్టర్స్‌ గోడలపై పెయింటింగ్‌లు వేయిస్తున్నారు. దారిన వెళ్లేవారు కూడా పెయింటింగ్‌లను చూసి అవగాహన కల్పించుకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే కార్మికులు అధికంగా ఉండే రైల్వే ఎస్‌ఆండ్‌టీ, లాలాగూడ  వర్క్‌షాప్‌ వద్ద ఉన్న రైల్వే మిక్సిడ్‌ హైస్కూలు  తదితర ప్రాంతాల్లో ఉన్న రైల్వే కాంపౌండ్‌ గోడలపై పెయింటింగ్‌ వేశారు. సబ్బుతో చేతులు తరచు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, బయటికు వెళ్లిన ప్రతిసారీ ముఖానికి మాస్క్‌లు ధరించాలని పలు వర్ణాలతో పెయింటింగ్‌లు వేశారు. పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచిస్తూ చెత్తను కేటాయించిన డబ్బాలలోనే వేయాలని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయవద్దని కోరుతూ  అధికారులు పెయింటింగ్‌లు వేయించడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 
logo