మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 00:47:11

పెరుగుతున్న ప్లాస్మా దాతలు

పెరుగుతున్న ప్లాస్మా దాతలు

ఇప్పటి వరకూ దానం చేసిన వారి సంఖ్య 213

బుధవారం ఒక్కరోజే 18 మంది దానం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రోజురోజుకూ ప్లాస్మా దాతల సంఖ్య పెరుగుతున్నది. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న అవగాహనతో కొవిడ్‌ విజేతలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 18 మంది ప్లాస్మా దానం చేశారు. దీంతో ఇప్పటి వరకు ప్లాస్మా దానం చేసిన వారి సంఖ్య 213కి చేరింది. ప్లాస్మా దానంతో కోలుకున్న వారి సంఖ్య నాలుగు వందలకు చేరింది. మరోవైపు దాదాపు 1000 మంది కరోనాను జయించిన వారి సమాచారం సేకరించిన సైబరాబాద్‌ పోలీసులు బాధితులకు అవసరమయ్యే ప్లాస్మాను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్మా దానం చేయాలనుకునే వారు కొవిడ్‌ కంట్రోల్‌ రూం నెంబర్‌ 490617440కు ఫోన్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోవాలని వారు కోరుతున్నారు. 


logo