సోమవారం 18 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 06:04:38

ఆదాయపు పన్నే.. దేశాభివృద్ధికి మార్గం

ఆదాయపు పన్నే.. దేశాభివృద్ధికి మార్గం

  •  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. శనివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌(ఏఐఎఫ్‌టీపీ) 23వ జాతీయ కన్వెన్షన్‌ ప్రారంభ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. సీబీడీటీ లెక్కల ప్రకారం దేశంలోని 130 కోట్ల జనాభాలో కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే నిజాయితీగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని అన్నారు. వాస్తవానికి మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపు పద్ధతి చాలా సులభంగా ఉందని, కానీ పన్ను చెల్లింపుపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీపీ ప్రతినిధులు నిఖిత, ఎం.శ్రీనివాసరావు, పీవీ సుబ్బారావు, ఎంవీకే మూర్తి పాల్గొన్నారు.