బస్తీ దవాఖానల్లో మెరుగైన సేవలు

గోషామహల్లో ఎనిమిదికి చేరనున్న దవాఖానలు
మరో ఐదు ఏర్పాటుకు ప్రతిపాదనలు
అబిడ్స్ : పేదలకు వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటుచేసింది. మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గం గన్‌ఫౌండ్రి డివిజన్ లోని పూల్‌బాగ్, దత్తాత్రేయనగర్ బస్తీ దవాఖానలున్నాయి. గౌలిగూడ, గన్‌ఫౌండ్రి కమ్యూనిటీ హాల్లో రెండు బస్తీ దవాఖానలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ఇటీవల కామాటిపురా, హనుమాన్‌టేక్డీ, సర్వర్‌నగర్ ప్రాంతాల్లో మూడు బస్తీ దవాఖానలను ప్రారంభించారు. దీంతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు బస్తీ దవాఖానలు పనిచేస్తున్నాయి. గడిఖానాలో మరో బస్తీ దవాఖానను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వారం రోజుల్లో ఈ బస్తీ దవాఖానను ప్రారంభించే అవకాశాలున్నాయి. గడిఖానా దవాఖాన ప్రారంభమైతే నియోజకవర్గంలో ఎనిమిది బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. జ్వరం, బీపీ, షుగర్, సాధారణ జబ్బులకు చికిత్సలు అందిస్తున్నారు. ప్రతినిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ నయం కాని జబ్బులు ఉంటే కింగ్‌కోఠి, ఉస్మానియా, గాంధీ దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు. బస్తీ దవాఖానల్లో నెలకోసారి చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. చంద్రకిరణ్ బస్తీ, జగన్నాథ, రహీంపురా ప్లే గ్రౌండ్స్, శివలాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌తో పాటు మాలకుంట ప్రాంతాల్లో దవాఖానల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.
సేవలు వినియోగించుకోవాలి
బస్తీలో ఏర్పాటు చేసిన దవాఖాన సేవలను అందరూ వినియోగించుకోవాలి. చిన్న చిన్న జబ్బులకు ప్రైవేటు దవాఖానలకు వెళితే వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. బస్తీ దవాఖానల్లో అవసరమైన మందులు ఇస్తున్నారు. గన్‌ఫౌండ్రి డివిజన్లోని గడిఖానాలో దవాఖానను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినాం. ప్రభుత్వం వెంటనే అనుమతి ఇచ్చింది.
- మమతాసంతోష్‌గుప్తా, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్
త్వరలో గడిఖానా బస్తీ దవాఖాన
గోషామహల్ నియోజకవర్గంలో ఏడు బస్తీ దవాఖానాలు ఉండగా గడిఖానాలో మరో బస్తీ దవాఖానను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి. గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమతాసంతోష్ గుప్తా దవాఖానను వైద్యులతో కలిసి సందర్శించారు. కొన్ని బస్తీ దవాఖానల్లో నిత్యం 100 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. అవసరం మేరకు అందుబాటులో ఉన్న వైద్య పరీక్షలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ యూసీడీ డీపీవో రాధారాణి తెలిపారు.
తాజావార్తలు
- గ్లోబల్ ఐటీ దిగ్గజంగా టీసీఎస్!
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం