మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 06:45:34

స్వయం ఉపాధితో ఆదర్శంగా నిలవాలి

స్వయం ఉపాధితో ఆదర్శంగా నిలవాలి

 వనస్థలిపురం : యువత సొంత వ్యాపారాలు చేపట్టి ఉపాధి పొంది మరి కొంతమందికి ఉపాధి చూపాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్‌ యశోదనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరస్తు రెస్టారెంట్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, విజయభాస్కర్‌రెడ్డి, రమేష్‌ నాయుడు, పొనుగోటి అంజన్‌రావు, వంగాల యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

logo