బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 07:03:14

సంక్షేమంలో దేశానికే ఆదర్శం.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సంక్షేమంలో దేశానికే ఆదర్శం.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సికింద్రాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు లబ్ధిదారులకు అందజేత

బేగంపేట/బన్సీలాల్‌పేట్‌, సెప్టెంబర్‌ 30: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలుతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. బుధవారం సికింద్రాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 157 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను ఐదు డివిజన్ల కార్పొరేటర్లు అరుణ, ఉప్పల తరుణి, ఆకుల రూప, లక్ష్మి, హేమలతతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్టు వెల్లడించారు. పేదింటి ఆడపడుచుల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల నుంచి రూ.లక్షా 116 సాయం అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు అసరా పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌కు ధీటుగా అన్నిరకాల సౌకర్యాలను కల్పించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా పేదల వద్దకే వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంతకుమారి, తహసీల్దార్‌ బాలశంకర్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆడబిడ్డ పెండ్లి సులువైంది

పూలదుకాణంలో రోజు కూలీపై పనిచేసే మాకు ఆడబిడ్డ పెండ్లి చేయ డం ఎంతో కష్టంగా మారింది. తల తాకట్టు పెట్టి నిఖా జరిపాం. సీఎం కేసీఆర్‌ ద్వారా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేతుల మీదుగా ఈ రోజు మాకు లక్ష రూపాయల సాయంతో పెండ్లి సులువైంది. మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతున్నది.     - నస్రీన్‌ బేగం, గౌస్‌ పాషా

పేదలకు కొండంత ధైర్యమిచ్చారు

కాళ్లు తడవకుండా నది దాటొచ్చు. కానీ కండ్లు తడవకుండా కూతురి పెండ్లి చేయలేం. సీఎం కేసీఆర్‌ ఆడపిల్లలకు మేనమామ లాగా మారారు. పేదలకు కొండంత ధైర్యంగా నిలిచారు. ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టాలు తొలగించే ఇలాంటి మంచి పథకాలతో మాలాంటి పేదలకు ఎంతో లాభం కలుగుతున్నది. 

- సుజాత    

భర్త లేక బతకడమే కష్టంగా మారింది 

భర్త లేక బతకడమే కష్టంగా మారిం ది. ఆడపిల్లలు పెరిగి పెద్దగయినరు. పెండ్లిలు ఎట్ల చేయాలే. పైసల కోసం ఆల్ల కాళ్లు, ఇల్ల కాళ్లు పట్టుకునే ఖర్మ ఉండేది. కేసీఆర్‌ సారు వల్ల నాలాంటి వారికి చానా మేలయితుంది. ఈ సర్కా రు సల్లగుండాలని దీవిస్తున్నాను బిడ్డా. సర్కారు ఇచ్చే పింఛనే మాకు దిక్కయ్యింది. - పార్వతమ్మ


logo