గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 07:25:19

నేటితో జలమండలి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకంకు ఆఖరు

నేటితో జలమండలి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకంకు ఆఖరు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల బకాయిల వసూలుకు జలమండలి ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం(ఓటీఎస్‌) గడువు నేటి (శనివారం)తో ముగియనున్నది. అసలు మొత్తాన్ని చెల్లించి వడ్డీ రాయితీ పొందాలంటూ ఇచ్చిన అవకాశాన్ని వందల సంఖ్యలో వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. శుక్రవారం నాటికి రూ.250 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇటీవల కాలంలో రెండు సంవత్సరాలకు పైబడి నీటి బిల్లులు చెల్లించని వారీ ఇండ్లకు వెళ్లి ఓటీఎస్‌ పథకం సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టి సత్ఫలితాలను రాబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్‌, డొమెస్టిక్‌ వర్గాలను ఓటీఎస్‌ పథకంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు. అయితే వందల సంఖ్యలో బకాయిదారులు ఉండటం, గడువు పెంపు ఉంటుందా? లేదా ? అన్నది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉందని అధికారులు తెలిపారు.