న్యూయార్క్: ప్రేమకు హద్దులు లేవంటారు. మనసుకు నచ్చిన వారిని మనువాడేందుకు ప్రేమికులు చేయని సాహసం ఉండదు. తాను అమితంగా ఇష్టపడే ప్రియురాలి ప్రేమను పొందేందుకు అమెరికా ఫుట్‌బాలర్ హస్సానీ డాట్సన్ మ్యాచ్‌నే వేదికగా చేసుకున్నాడు. మేజర్ లీగ్ సాకర్‌లో భాగంగా మిన్నెసొటా ఎఫ్‌సీ తరఫున డాట్సన్ బరిలోకి దిగాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రేయసి పెట్రా వుకోవిచ్ ముందు మోకాళ్లపై కూర్చోని తనను పెండ్లి చేసుకోవా అంటూ ప్రపోజ్ చేశాడు. ఊహించని పరిణామానికి ఉబ్బితబ్బిబైన పెట్రా… ఓకే చెప్పడంతో డాట్సన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పెండ్లికి అంగీకారం తెలుపడంతో వేలాది ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె ఎడమచేతి వేలికి ఉంగరం తొడిగాడు. హస్సానీ ప్రేమను వర్ణించేందుకు మాట లు సరిపోవడం లేదంటూ పెట్రా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.