అత్యవసరమైతే మాత్రం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నారు. అప్పుడు తప్పనిసరిగా స్వీయ రక్షణ చర్యలు పాటిస్తున్నారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ రిస్పెప్షన్లో దరఖాస్తు అందిస్తున్నారు. ఇక పెట్రోలింగ్ సిబ్బంది ఫిర్యాదుదారుడి ఇంటికి వచ్చి దరఖాస్తు స్వీకరిస్తున్న సమయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరైన నగర పోలీసులు ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు. అంతేకాక విస్తృతమైన పెట్రోలింగ్ వ్యవస్థను నగరవాసులకు మరింత దగ్గర చేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో పెట్రోలింగ్ ఫిర్యాదుల ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కరోనా సమయంలో ఈ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత పెరుగగా.. తిరిగి మహమ్మారి విజృంభణతో పునరుద్ధరించారు.
చిన్న చిన్న విషయాలకు పోలీస్స్టేషన్లకు రావద్దని చేసిన సూచనలకు మంచి స్పందన వస్తున్నది. కరోనా నేపథ్యంలో పోలీస్స్టేషన్లకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. క్షేత్రస్థాయిలో పర్యటించే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందికి స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 202 స్పాట్ ఫిర్యాదులు పెట్రోలింగ్ సిబ్బందికి అందాయి.