రెక్కీచేసి.. కొల్లగొట్టారు

- ఒకరు 40, మరొకరు 10... ఇద్దరూ కలిసి మరో 13 ఇండ్లల్లో చోరీ
- పీడీ యాక్ట్ విధించినా మారని బుద్ధి.. జైలు నుంచి వచ్చి అదేబాట
- ఇద్దరు పాతనేరస్తులు అరెస్ట్.. 8.5లక్షల విలువైన సొత్తు స్వాధీనం
మన్సూరాబాద్, జనవరి 12: వేర్వేరు దొంగతనాల కేసుల్లో జైకు వెళ్లారు... అక్కడ అయిన పరిచయంతో మంచి స్నేహితులుగా మారారు.. జైలు నుంచి బయటకు వచ్చి.. తిరిగి చోరీలబాట పట్టారు... ఇలా.. దొంగతనాల కోసం తిరుగుతుండగా హయత్‌నగర్ పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు నిందితుల నుంచి రూ. 8.5 లక్షల విలువైన 11 తులాల బంగారు ఆభరణాలు, 128 తులాల వెండి వస్తువులు, 2 ఎల్ఈడీ టీవీలు, బైక్, రూ. 23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, మల్లన్నపాలెంకు చెందిన షేక్ రఫీ అలియాస్ నూర్ మహ్మద్ (35) .. జిల్లా పరిధిలో 40 ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు.. ఇతడిపై పీడీ యాక్ట్కూడా విధించారు. అలాగే ఖమ్మం జిల్లా త్రీటౌన్, గ్రైన్ మార్కెట్‌కు చెందిన మందల నవీన్ (30) 10 ఇండ్లల్లో చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. ఇతడిపై కూడా పీడీ యాక్ట్ విధించారు.. అక్కడ వారిద్దరికి పరిచయమై.. మంచి స్నేహితులుగా మారారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వారిపై ఖమ్మంలో నిఘా ఉండటంతో నగరానికి వచ్చి పెద్ద అంబర్‌పేటలో ఉంటున్నారు. ఇక్కడ నూర్ మహ్మద్ కారు డ్రైవర్‌గా, నవీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తిరిగి ఇక్కడ చోరీలు చేయడం ప్రారంభించారు. బైక్‌పై తిరుగుతూ.. రెక్కీ నిర్వహించి.. తాళం వేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా.. హయత్‌నగర్ పీఎస్ పరిధిలో 7, ఎల్బీనగర్ పీఎస్‌లో- 1, ఘట్కేసర్లో- 1, సూర్యాపేట జిల్లా మోతేలో- 1, చివ్వెంల లో- 1, నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో- 1, అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో 1 ఇంట్లో దొంగతనాలకు పాల్పడ్డారు.
కాగా...మంగళవారం ఉదయం వారిద్దరు హయత్‌నగర్‌లోని స్వాతి వైన్స్ పక్కన ఉన్న ఓ బంగారం షాపు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా హయత్‌నగర్ పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనాల విషయం బయటపడింది. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని.. రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో సీఐలు సురేందర్, పురుషోత్తం రెడ్డి, డీఐ నాగార్జున పాల్గొన్నారు.
గాజులరామారం : పగలు రెక్కీ నిర్వహించి.. తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మంగళవారం జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.12.25 లక్షల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం , సీఐ సైదులు, డీఐ మహేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా రాళ్లపేట గ్రామానికి చెందిన పాత నేరస్తుడు చిత్తారి శ్రీను (25), నాగర్‌కర్నూల్ జిల్లా నల్లబోతుల పరుశురామ్ (28)తో కలిసి జగద్గిరిగుట్టలోని షిర్డీహిల్స్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఉదయం వేళల్లో కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తిస్తారు. మధ్యా హ్న సమయంలో ఇనుప రాడ్లతో తాళాలు పగలగొట్టి చొరీలకు పాల్పడుతున్నారు. కాగా... మంగళవారం డీఐ మహేశ్.. క్రైం పోలీసులతో కలసి ఉదయం జగద్గిరిగుట్ట ఔట్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన శ్రీను, పరుశురామ్ పోలీసులను చూసి పారిపోయే యత్నం చేశారు. వారిని పట్టుకుని విచారించగా.. దొంగతనాల విషయం బయటపడింది. వారి నుంచి 21 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలతో పాటు హెచ్‌పీ గ్యాస్ సిలిండర్, జియో ఫోన్‌తో కలిపి మొత్తం రూ.12.25 లక్షల విలువ గల సొత్తు ను స్వాధీనం చేసుకున్నారు. చిత్తారి శ్రీనుపై కరీంనగర్, మెట్పల్లి, ఆదిలాబాద్, ధర్మపురి, హజీపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, కాజీపేట, జగిత్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి కరీంనగర్ జైలులో శిక్ష అనుభవించాడు. గత సంవత్సరం ఆగస్టులో జైలు నుంచి విడుదలై జగద్గిరిగుట్టలో నివాసముంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఇటీవల కాలంలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌తో పాటు జీడిమెట్ల, నాగర్‌కర్నూల్, గద్వాల్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైయ్యాయి. దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చి.. తీరుమార్చుకోని ఈ ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
తాజావార్తలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు