ఈసారైనా.. ఓటు వేస్తారా!

- ఎన్నికలపై ఆసక్తి చూపని నగర ఓటరు
- ఈసారి కొవిడ్‌కు తోడు వరుస సెలవులు
- పోలింగ్‌శాతంపై సర్వత్రా అనుమానాలు
హైదరాబాద్ : హైదరాబాద్‌వాసులకు మొదటి నుంచి ఎందుకో ఎన్నికలంటే ఆసక్తి తక్కువ. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ శాతం 50కి మించలేదు. డిసెంబర్ ఒకటిన జరుగనున్న బల్దియా ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ముందే బద్ధకిస్టులు. ఆపై కొవిడ్ భయం, మరోవైపు వరుసగా సెలవులు.. ఈ ప్రభావం పోలింగ్ శాతంపై పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు, దీర్ఘకాల రోగులు ఓటింగ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. క్రితంసారి 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో 45.27శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అంతకుముందు 2009లో కేవలం 42.95శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సైతం పోలింగ్ శాతం 50శాతానికి మించడంలేదు.
కొవిడ్ కారణంగా ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం సౌలభ్యం కల్పించడంతో చాలామంది ఇప్పటికే తమ స్వగ్రామాలకు వెళ్లి అక్కడినుంచే పనిచేస్తున్నారు. స్కూళ్లు తెరుచుకోకపోవడం వల్ల కూడా తల్లిదండ్రులు, పాఠశాలల సిబ్బంది కూడా ఊరుబాట పట్టారు. ఇక ఎన్నికలు జరుగనున్న సమయంలో కూడా వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ నెల 29న ఆదివారం కాగా, అంతకుముందు 28న శనివారం ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఇక 30వ తేదీ కార్తీక పౌర్ణమి సెలవు కాగా, ఎన్నికల రోజైన డిసెంబర్ ఒకటిన ఎలాగూ సెలవు ఉంటుంది. వరుసగా నాలుగురోజులు వస్తున్న సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారని, వీరిలో అత్యధికులు నగరం వీడి వెళ్లవచ్చని భావిస్తున్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో
- అంతరిక్ష యాత్ర కేవలం రూ.96 లక్షలకే..
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..