గురువారం 28 మే 2020
Hyderabad - May 19, 2020 , 00:28:43

గంటల్లో పునరుద్ధరించారు..

గంటల్లో పునరుద్ధరించారు..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ వీఐపీ జోన్‌. మనవాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలవారు, విదేశీయులుండే ప్రాంతం. నిమిషం పాటు కరెంట్‌ పోయినా ఓర్చుకోలేరు. కాల్‌సెంటర్లకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తుంటాయి.శనివారం మధ్యాహ్నం కురిసినవర్షం, గాడ్పులకు ఈప్రాంతంలో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది.వందల సంఖ్యలో చెట్లు ,40 విద్యుత్‌ స్తంభాలు,4 ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో అధికారులకు ఫోన్లమీద ఫోన్లు వస్తున్నాయి. ఇది ఒకవైపు..

 అసలే లాక్‌డౌన్‌. ఎక్కడి వారు అక్కడే. రవాణా సదుపాయాలు లేవు. కూలీలు దొరకరు. వాహనాలు రావు. క్రేన్లు అందుబాటులో ఉండవు. విరిగిపడ్డ చెట్లను.. కొమ్మలను తొలిగించాలి, తెగిపడ్డ విద్యుత్‌ తీగల స్థానంలో కొత్తవి వే యాలి. స్థంభాలు పాతాలి. ట్రాన్స్‌ఫార్మర్లు భిగించాలి. కాలనీల్లోని జనం ఫోన్లు చేసి విసిగించేవారే కాని, కనీసం ఇండ్లల్లో నుంచి తొంగిచూడరు. సాయం చేస్తామనేవారే కనిపించరు. ఓ చేయివేస్తామనేవారు ఒక్కరు కూడా ఉండరు. 

 ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ టీఎస్‌ఎస్పీడీసీఎ ల్‌ అధికారులు, ఇంజినీర్లు శ్రమించి గంటల వ్యవధిలోనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. రాత్రింభవళ్లు శ్రమించి పూ ర్వ స్థితికి తేగలిగారు. శనివారం రోజున నగరంలో కురిపిన వర్షానికి జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో అపారనష్టం వాటిల్లింది. రోడ్‌ నంబర్‌ 13,17.67,70ల్లో చెట్లన్నీ విద్యుత్‌ స్తంభా లు, తీగల మీదపడి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర నష్టం కలిగిం ది. విషయం తెలుసుకున్న ఇంజినీర్లు, అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు.

తాత్కాళికంగా ఇతర ప్రాం తాల నుంచి విద్యుత్‌ సరఫరాను అందజేసి జనం అవస్థలు తొలగించారు.ఆ తర్వాత కూలీలకు సమీకరించేందుకు అష్టకష్టాలు పడ్డారు. పలు ప్రాంతాల్లో ఉన్న 110మంది కూలీలను రప్పించి, 5 క్రేన్లను సమీకరించి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలల సహకారంతో విద్యుత్‌ మరమ్మతులు చేపట్టారు. అత్యవసర బృందాలు రంగంలోకి దింపి ఆదివారం తెల్లవారుజామున 3గంటల్లోగా మరమ్మతులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సీజీఎం స్వామి, ఎస్‌ఈ ఆనంద్‌లు సిబ్బంది, ఇంజినీర్లను అభినందించారు.


logo