అంబర్‌పేట, మార్చి 21: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మే రకు తాగునీటిని ఉచితంగా సరఫరా చే సేందుకు జలమండలి అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబర్‌పేటలో ఉచిత తాగునీరు పొందేందుకు అర్హులైన వారి ఎంపికకు సంబంధించి ఆదేశాలు రావడంతో రెండు సబ్ డివిజన్ల అధికారులు అందుకనుగుణంగా ఏర్పా ట్లు చేశారు. మొత్తం 28,428 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుంది.
నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ను లింకు చేసుకోవాలి
అందుకుగానూ నల్లా కనెక్షన్ క్యాన్ నంబర్‌కు ఆధార్‌ను లింకు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నల్లాకు మీటర్‌ను బిగించుకోవాలని తెలిపారు. ఆధార్ లింకు, నల్లా మీటర్ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని, ఈ నెల 31వ తేదీ లోపు ఆధార్‌లింకు, మీటర్ బిగింపు పూర్తి చేసు కోవాలని అన్నారు.
ఐదు సెక్షన్ల పరిధిలో…
జలమండలి నారాయణగూడ పరిధిలోకి వచ్చే అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు సెక్షన్లు ఉన్నాయి. శివం, అడిక్‌మెట్, రామాంతపూర్, విజ్ఞాన్‌పురి, బర్కత్‌పుర సెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 28,428 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో మురికివాడల్లో 2,581, వ్యక్తిగతంగా 24, 994, అపార్ట్మెంట్లలో 853 ఉన్నాయి. వీరంతా లబ్ధిదారులే. వీరికి నెలకు 20వేల లీటర్ల నీటిని ఉచితంగా అందజేస్తారు.
మీటర్లు ఉన్నవారికే….
అయితే ఈ పథకం నల్లాలకు మీటర్లు ఉన్నవారికే వర్తిస్తుంది. మీటర్లు లేనివారికి మాత్రం ఈ పథకం వర్తించదు. మీటర్లు లేనివారికి ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు అందరూ నల్లాలకు మీటర్లు బిగించుకోవాలని చెప్పింది. అయితే ఇప్పటి వరకు సగం మంది వినయోగదారులే ఆధార్ లింకు చేసుకున్నారని, మిగ తా వారు కూడా 31వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. లేకుం టే ఈ పథకం వర్తించదని అధికారులు పేర్కొంటున్నారు.