హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు అపూర్వ స్పందన లభించింది. సోమవారం హైదరాబాద్లో యోగా డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఏడో యోగా దినోత్సవంలో భాగంగా సిటీ వాసులు యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా సంస్థలు కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా యోగా డే వేడుకలను నిర్వహించాయి. ఎన్జీవోలు, ఆధ్యాత్మిక సంస్థలు.. ప్రత్యేక యోగా తరగతులను ఆన్లైన్లో నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో పలువురు యోగాసనాలతో దర్శనమిచ్చారు. యోగా దినోత్సవ వేడుకల ఫోటోలను, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.