మంగళవారం 09 మార్చి 2021
Hyderabad - Oct 15, 2020 , 10:04:29

ముంపు ప్రాంత ప్రజలను తరలించాలి

ముంపు ప్రాంత ప్రజలను తరలించాలి

జియాగూడ: జియాగూడ వందఫీట్ల బైపాస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి ఆదేశించారు. బుధవారం జియాగూడ డివిజన్‌ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాలను కార్పొరేటర్‌ మిత్రకృష్ణ, ఆసీఫ్‌నగర్‌ తహసీల్దార్‌ నవీన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 

నదీం కాలనీలో..

మెహిదీపట్నం: కార్వాన్‌ నియోజకవర్గంలోని నదీం కాలనీలో కలెక్టర్‌ శ్వేతామహంతి పర్యటించారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కౌసర్‌ మోయినుద్దీన్‌ కలిసి వరద ముంపు బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ముంపు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo