e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News go2box: క‌రెంటు అవ‌స‌రం లేని ఆక్సిజ‌న్ జ‌న‌రేట‌ర్‌.. హైద‌రాబాద్ సంస్థ ఘ‌న‌త‌

go2box: క‌రెంటు అవ‌స‌రం లేని ఆక్సిజ‌న్ జ‌న‌రేట‌ర్‌.. హైద‌రాబాద్ సంస్థ ఘ‌న‌త‌

go2box: క‌రెంటు అవ‌స‌రం లేని ఆక్సిజ‌న్ జ‌న‌రేట‌ర్‌.. హైద‌రాబాద్ సంస్థ ఘ‌న‌త‌

హైద‌రాబాద్‌: ఆక్సిజ‌న్‌.. ఆక్సిజ‌న్‌.. ఆక్సిజ‌న్‌.. కొవిడ్ సెకండ్ వేవ్ స‌త‌మ‌తం చేస్తున్న వేళ దేశ‌మంతా ప్రాణ‌వాయువు కోసం అల్లాడుతోంది. ఈ ఆక్సిజ‌న్ దొర‌క్క ఇప్ప‌టికే ఎంతో మంది ప్రాణాలు విడ‌వ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం. అయితే అలాంటి ప‌రిస్థితి త‌లెత్తకూడ‌ద‌న్న ఉద్దేశంతో హైద‌రాబాద్‌కు చెందిన డూచెరె అనే కంపెనీ ఓ ఆక్సిజ‌న్ జ‌న‌రేట‌ర్‌ను త‌యారు చేసింది. క‌రెంటు అవ‌స‌రం లేకుండానే ఇది ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేస్తుండటం అస‌లు విశేషం. దీని పేరు go2box. ఇది 95 శాతం ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేష‌న్‌తో నిమిషానికి 10 లీట‌ర్ల మెడిక‌ల్ గ్రేడ్ ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది.

go2box.. ఐడియా ఎలా వచ్చింది?
అందుబాటు ధ‌ర‌లో క‌రెంటు అవ‌స‌రం లేకుండా ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసే ఈ go2box ఎంతో మంది జీవితాల‌ను నిల‌బెట్ట‌గ‌ల‌ద‌ని డూచెరె సంస్థ సీఈవో క్రిస్పియ‌న్ లారెన్స్ అంటున్నారు. ఇది ఆయ‌న‌, ఆయ‌న టీమ్ సాధించిన ఘ‌న‌త‌. అస‌లు ఈ ఐడియా ఎలా వ‌చ్చిందో లారెన్స్ వివ‌రించారు. మాది నిజానికి వేర‌బుల్ టెక్‌, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ కంపెనీ. కానీ గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన త‌ర్వాత మా టీమ్ కోస‌మే అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో ఉప‌యోగించ‌డానికి ఒక ఆక్సిజ‌న్ మెషీన్ త‌యారు చేయాల‌ని అనుకున్నాం. కాన్స‌న్‌ట్రేట‌ర్లా లేక జ‌న‌రేట‌ర్లా అనేదానిపై చ‌ర్చించిన త‌ర్వాత త‌క్కువ ధ‌ర‌తో, సులువుగా పంపిణీ చేయ‌గ‌లిగే వాటిని త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించాం. అలా ఈ go2box వ‌చ్చింది అని లారెన్స్ తెలిపారు.

go2box.. ఎలా ప‌ని చేస్తుంది?
క‌రెంటు లేకుండానే ఇది ఆక్సిజ‌న్‌ను ఎలా ఉత్ప‌త్తి చేస్తుంద‌న్న డౌట్ రావ‌చ్చు. అయితే ఈ మెషీన్ పెరాక్సైడ్ ఆధారిత ర‌సాయ‌న ప్ర‌తిచ‌ర్య‌ను ఉప‌యోగించి ఆక్సిజ‌న్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. ఆక్సిజ‌న్ ఎలా తయారు చేస్తార‌న్న విష‌యం కొత్త‌ది కాక‌పోవ‌చ్చు కానీ.. దానిని సుర‌క్షితంగా, ఎక్క‌డికైనా తీసుకెళ్ల‌గ‌లిగేలా చేయాల‌న్న ఉద్దేశంతోనే కొన్ని నెల‌ల పాటు శ్ర‌మించి ఈ go2boxని సృష్టించామ‌ని లారెన్స్ తెలిపారు. దీనిని లేబొరేట‌రీల‌లోనూ ప‌రీక్షించామ‌ని, ఇది 95 శాతం ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేష‌న్‌ను ఇస్తున్న‌ట్లు తేలింద‌ని చెప్పారు.

ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది?
ఆక్సిజ‌న్ హై-ఫ్లో రేటు అవ‌స‌రం లేని వారికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుందిన లారెన్స్ తెలిపారు. హాస్పిట‌ల్‌లో బెడ్ దొరికేలోపు తాత్కాలికంగా దీనిని వాడొచ్చ‌ని ఆయ‌న చెప్పారు. వీటి ద్వారా ఆక్సిజ‌న్ అందించే సెంట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని తాము భావిస్తున్నామ‌ని, అలాంటి ఓ సెంట‌ర్‌ను వ‌చ్చే వారమే ప్రారంభిస్తామ‌నీ ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ఈ ప‌రిక‌రం 15 కేజీల బ‌రువు ఉంటుంది. దీనికి అద‌నంగా 20 లీట‌ర్ల కెమిక‌ల్ కంటైన‌ర్ ఉంటుంది. దీనిని ర‌వాణా స‌మ‌యంలో తీసివేయ‌వ‌చ్చు. ఈ ప‌రికరం ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేయ‌డానికి అవ‌స‌ర‌మైన కెమిక‌ల్ పంపిణీ కోసం కూడా ప్ర‌త్యేక సప్లై చెయిన్ ఏర్పాటు చేయాల‌ని ఈ సంస్థ భావిస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
go2box: క‌రెంటు అవ‌స‌రం లేని ఆక్సిజ‌న్ జ‌న‌రేట‌ర్‌.. హైద‌రాబాద్ సంస్థ ఘ‌న‌త‌

ట్రెండింగ్‌

Advertisement