సరికొత్తగా.. సాగర తీరం
F_1611450414.jpg)
- ఆకట్టుకుంటున్న నిర్మాణ శైలి
- రూ.27 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టిన హెచ్ఎండీఏ
- త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి
- కొత్త ట్యాంక్‌బండ్ ఎలా ఉందంటూ కేటీఆర్ ట్వీట్
- స్పందించిన నెటిజన్లు
హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది ట్యాంక్‌బండ్. నగరానికి కొత్తగా ఎవరైనా వస్తే తొలుత చూసేది ఈ ప్రాంతాన్నే. నగరం నడిబొడ్డున, జంటనగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వారధికి ఆధునిక హంగులు కల్పిస్తున్నారు. రూ.27 కోట్ల వ్యయంతో పర్యాటకులను మరింత ఆహ్లాదపరిచేందుకు చేపడుతున్న సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ చిత్రాలను శనివారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఉంచి ఎలాగున్నాయో చెప్పండని నెటిజన్లకు సూచించగా..చాలామంది బాగున్నాయ్ సార్ అని కితాబిచ్చారు.
న్యూయార్క్ నగరానికి లిబర్టీ ఐల్యాండ్... లండన్ నగరానికి ట్రాఫాల్గర్ స్కేర్... మరి హైదరాబాద్ నగరానికి ట్యాంక్‌బండ్ ఒక మణిహారం. అలాంటి మణిహారం మరిన్ని అదనపు హంగులతో, ఆధునిక, వారసత్వ శోభను సంతరించుకొని అటు నగరవాసులను, పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు సిద్ధమవుతున్నది. సుమారు రూ.27 కోట్లతో చేపట్టిన ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు పూర్తికావస్తున్నాయి.
ట్యాంక్‌బండ్ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. నగరవాసులు మైమరిచిపోయేలా హెరిటేజ్ ఆర్నమెంటల్ డెకొరేటివ్ పోల్స్(క్యాస్ట్ ఐరన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతం చూడగానే పురాతన శైలిలో సరికొత్తగా ఆకట్టుకోనుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల వారధిగా, హుస్సేన్‌సాగర్‌పై నిర్మించిన ట్యాంక్‌బండ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ట్యాంక్‌బండ్‌కు ఆధునిక హంగులు కల్పిస్తూ సుమారు రూ.27కోట్లతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ సుందరీకరణ పనులు చేపట్టింది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న సుందరీకరణ పనులను పరిశీలిస్తున్న నగరవాసులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారంటూ కితాబునిస్తున్నారు.
ఇరువైపులా ఫుట్‌పాత్‌ల ఆధునీకరణ
ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఫుట్‌పాత్‌లను పూర్తిగా తొలగించి, గ్రానైట్ రాళ్లతో తీర్చిదిద్దుతున్నారు. పీవీసీ పైపులను, వరద నీటి పైపులైను వ్యవస్థను భూగర్భంలోంచి వేస్తున్నారు. ట్యాంక్‌బండ్ ప్రాంతం పటిష్ఠంగా ఉండేందుకు క్రషర్ సాండ్‌తో పీసీసీ, స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. కాగా యేటా గణేశ్ ఉత్సవాల సమయంలో విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసే క్రేన్లకు ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఫుట్‌పాత్ ఆధునీకరణ పనులకు రూ.14.50 కోట్లను ఖర్చు చేస్తున్నారు.
అలనాటి వారసత్వం ఉట్టిపడేలా..
హైదరాబాద్ నగరం అంటేనే పురాతన, వారసత్వ సంపదకు నిలయం. అలాంటి నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ కట్టపై అలనాటి వారస్వత్వాన్ని కండ్లముందుంచుతూ సరికొత్త తరహాలో విద్యుద్దీపాలంకరణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. సీఐ (క్యాస్ట్ ఐరన్) రెయిలింగ్, హెరిటేజ్ ఆర్నమెంటల్ డెకొరేటివ్ పోల్స్, ఆధునిక శైలిలో బస్టాప్‌లు, రెయిన్ షెల్టర్లు, కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణతో కూడిన వీధి దీపాల స్తంభాలను ప్రతి 15 మీటర్లకు ఒకటి ఎడమ వైపు, ప్రతి 30 మీటర్లకు ఒకటి చొప్పున కుడివైపున నిర్మిస్తున్నారు.
పునర్నిర్మాణంపై కేటీఆర్ ట్వీట్..
ట్యాంక్‌బండ్ పునర్నిర్మాణంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి ట్వీట్ చేశారు. ట్యాండ్బండ్ను మీరు ఎలా ఇష్టపడతారు? మీ కామెంట్స్, సలహాలు తెలపండి అంటూ ట్యాంక్‌బండ్‌కు సంబంధించిన నాలుగు ఫొటోలను షేర్ చేశారు. పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. స్పందించిన పలువురు నెటిజన్లు చాలా అద్భుతంగా పని చేశారని... గణేశ్ నిమజ్జన సమయంలో ఈ ప్రాంతం కళావిహీనంగా మారుతున్నదని, ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే ట్యాంక్‌బండ్‌కు వెళ్లి చూడాలనిపిస్తోందని మరొకరు ట్వీట్ చేశారు.
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్