e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home టాప్ స్టోరీస్ హుస్సేన్‌సాగర్‌కు మరింత భద్రత

హుస్సేన్‌సాగర్‌కు మరింత భద్రత

హుస్సేన్‌సాగర్‌కు మరింత భద్రత
 • భారీ వరదలొచ్చినా తట్టుకునేలా ముందస్తు చర్యలు
 • రూ.41 కోట్లతో వర్టికల్‌ గేట్ల నిర్మాణానికి నిర్ణయం
 • మరో రూ.25 కోట్లతో మారియట్‌ హోటల్‌ ముందు బ్రిడ్జి నిర్మాణం
 • ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా ఆమోదించిన ప్రభుత్వం
 • శివారు ప్రాంతాల్లోనూ ముంపు బాధలు తీరేలా డ్రెయిన్ల నిర్మాణం

హుస్సేన్‌సాగర్‌కు ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి గతేడాది భారీ వర్షాలతో సాగరానికి ఎలాంటి ప్రమాదం రాలేదు.కానీ తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు ప్రదర్శించింది. ఒకవేళ ఊహించని వరద వస్తే… ముందు జాగ్రత్త చర్యగా రూ.66 కోట్లతో రెండు కీలకమైన పనులు చేపట్టనుంది. రూ.41 కోట్లతో సాగర్‌కు గేట్లు అమర్చి.. తద్వారా భారీ వరదలొచ్చినపుడు సాఫీగా నీళ్లు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం రూ.25 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనుంది.

సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ – 513.40 మీటర్లు

 • 2000 సంవత్సరంలో వచ్చిన వరద – 514.900 మీటర్లు. అంటే ఎఫ్‌టీఎల్‌ కంటే 1.540 మీటర్ల ఎగువన వరద వచ్చింది. 2012లో 513.840 మీటర్లు అంటే 44 సెంటీమీటర్ల ఎగువ దాకా వరద వచ్చింది. గత ఏడాది 513.540 మీటర్లు అంటే ఎఫ్‌టీఎల్‌ కంటే 13 సెంటీమీటర్ల మేర ఎక్కువ మాత్రమే వరద వచ్చింది.
 • గతంలో చేసిన అధ్యయనాల మేరకు హుస్సేన్‌సాగర్‌కు గరిష్ఠంగా వచ్చే వరద అంచనా – 40వేల క్యూసెక్కులు
 • ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌ డిశ్చార్జి సామర్థ్యం.. ఎడమ సర్‌ప్లస్‌ వియర్‌-19,500 క్యూసెక్కులు, కుడి సర్‌ప్లస్‌ వియర్‌-1,000 క్యూసెక్కులు, నాలుగు స్లూయిస్‌లు-200 క్యూసెక్కులు, ఎడమ వైపు స్లూయిస్‌ – 550 క్యూసెక్కులు, మొత్తం- 21,200 క్యూసెక్కులు.
 • డిశ్చార్జి సామర్థ్యం పెంచడమే శాశ్వత పరిష్కారం..
 • ప్రస్తుతం ఉన్న డిశ్చార్జి సామర్థ్యాన్ని పెంచడమే శాశ్వత పరిష్కారమని అనేక అధ్యయనాల్లో తేల్చారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గేట్ల ఏర్పాటుతో పాటు బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
 • హుస్సేన్‌సాగర్‌ సిల్‌ లెవల్‌ను కాస్త తగ్గించి… వర్టికల్‌ గేట్లను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం వరద దిగువకు సాఫీగా వెళ్లేలా మారియట్‌ హోటల్‌ ముందు ఆరు లేన్ల భారీ బ్రిడ్జిని నిర్మిస్తారు. తద్వారా హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద వచ్చినప్పుడు గేట్ల నుంచి బ్రిడ్జి దిగువగా వరద కింద ఉన్న నాలాలోకి ప్రవహిస్తుంది.
Advertisement
హుస్సేన్‌సాగర్‌కు మరింత భద్రత

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement