బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 08:13:31

కరోనాతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

కరోనాతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

  • సైనిక్‌పురి అంబేద్కర్‌నగర్‌లో విషాదం

నేరేడ్‌మెట్‌ : వారిద్దరూ భార్యాభర్తలు. ముప్పై ఏండ్ల కింద కలిసి జీవితం మొదలు పెట్టారు. బతుకుదెరువుకు సొంతూరు వదిలి సిటీకి వచ్చారు. ఒకరికొకరు తోడుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ కుటుంబంలో కరోనా మహమ్మారి నిప్పులు పోసింది. వైరస్‌ సోకి భర్త చనిపోగా, ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది.  నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేశ్‌(60), ధనలక్ష్మి(55)  దంపతులు కొన్నేండ్ల కింద ఉపాధి కోసం సిటీకి వచ్చి సైనిక్‌పురిలోని అంబేద్కర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భర్త కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో, భార్య ఏఎస్‌రావు నగర్‌లోని సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ వెంకటేశ్‌ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు.  ఆయన మరణించడంతో ధనలక్ష్మి తట్టుకోలేకపోయింది. భర్త దూరవమవడం, పిల్లలు కూడా లేకపోవడంతో కలత చెంది బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో అంబేద్కర్‌నగర్‌లో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారంతో నేరేడ్‌మెట్‌ పోలీసులు వచ్చి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.