సోమవారం 21 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 05, 2020 , 00:11:29

మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాలి

మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాలి

చిక్కడపల్లి : మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌  అన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు సహకారం అందించాలని ఆయన సూచించారు. ఎస్‌ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్‌ డివిజన్‌లోని టీఆర్‌టీ కమ్యూనిటీ హాల్లో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అక్రమ రవాణా నుంచి బాలలను రక్షించిన సాహసులను సన్మానించారు.  ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు, గాంధీనగర్‌ కార్పొరేటర్‌ ముఠాపద్మానరేశ్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు ముఠా నరేశ్‌, ఎస్‌ఆర్‌డీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, నాగరాజు, సునంద, లక్ష్మీగణపతి దేవాలయం చైర్మన్‌ ముచ్చకుర్తి ప్రభాకర్‌, మల్లికార్జున్‌రెడ్డి, శివరాణి తదితరులు పాల్గొన్నారు. 


logo