సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 28, 2020 , 08:51:27

పావలా వడ్డీ పేరుతో రూ.18 లక్షలు వసూలు

పావలా వడ్డీ పేరుతో రూ.18 లక్షలు వసూలు

హైదరాబాద్ : పావలా వడ్డీ ఆశ చూపి.. 229 మందిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   సీఐ శివశంకర్‌ రావు కథనం ప్రకారం.....సికింద్రాబాద్‌ రామకృష్ణాపురంకు చెందిన గజ్జల పద్మావతి అలియాస్‌ పద్మా రెడ్డి (59), మల్కాజిగిరికు చెందిన అత్వెల్లి విష్ణు ప్రసాద్‌ (56) స్నేహితులు. వీరు బస్తీల్లో ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా గూపు సభ్యులకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు.  వీరి మాటలు నమ్మిన సుమారు 229 మంది మహిళలు... వారికి రూ.18 లక్షలు చెల్లించారు. నెలలు గడుస్తున్నా రుణాలు ఇవ్వడంలేదు.  దీంతో బాధితురాలు సంపూర్ణ నందా (65) ఫిర్యాదు చేసింది.  పోలీసులు నిందితులు పద్మారెడ్డి, విష్ణులను అరెస్ట్‌ చేశారు.


logo