వృక్షోః రక్షిత రక్షిత ః అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని అర్థం. మానవాళికి ప్రాణవాయువునిచ్చే చెట్ల పరిరక్షణలో భాగంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సుమారు పదివేల చెట్లను తొలగించి తిరిగి నాటించి పునర్జీవం పోసింది. తెలంగాణ జిల్లాలకు ఎల్పీజీ సరఫరా సులభతరం చేసేందుకు హెచ్‌పీసీఎల్ చిన్న గోల్కొండ నుంచి ఘట్కేసర్ వరకు ఔటర్ వెంబడి ఎల్పీజీ పైల్‌లైన్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు భారీ సంఖ్యలో చెట్లు అడ్డురావడంతో నరికేయకుండా హెచ్ఎండీఏ, తెలంగాణ అర్బన్ ఫారెస్ట్రీ అండ్ ట్రీ ప్రొటెక్షన్ కమిటీతో కలిసి తొలగించి ఔటర్ చుట్టూ తిరిగి నాటించారు. 35 రోజుల క్రితం నాటిన (ట్రాన్స్‌లొకేట్) చెట్లు చిగురించి పెరుగుతున్నాయని హెచ్‌పీసీఎల్ డీజీఎం శేషాచారి తెలిపారు. 98 శాతం చెట్లు తిరిగి ప్రాణం పోసుకోవడంపై హెచ్‌జీసీఎల్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.