e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home హైదరాబాద్‌ ఉచితానికి.. ఇంకా అవకాశం

ఉచితానికి.. ఇంకా అవకాశం

 • ప్లే స్టోర్‌లో మొబైల్‌ అప్లికేషన్‌
 • ఫ్లాట్స్‌ ఓనర్లందరూ అనుసంధానం చేసుకోవాల్సిందే..
 • జీహెచ్‌ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తప్పనిసరి
 • ఒక వినియోగదారుడు ఒక క్యాన్‌ నంబర్‌ను
 • అనుసంధానించుకోవాలి
 • ఉచిత తాగునీటి పథకంపై సందేహాలను
 • నివృత్తి చేసిన జలమండలి ఎండీ

ఉచిత తాగునీటికి అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్స్‌ ఓనర్లందరూ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందేనని జలమండలి ఎండీ దానకిశోర్‌ స్పష్టం చేశారు. ఉచిత తాగునీటి పథకం అమలులో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఆయన మంగళవారం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఉచితంగా తాగునీటిని పొందేందుకు ప్రభుత్వం నాలుగు నెలల గడువు ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు 8.24 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పటికీ ఈ పథకం వినియోగదారులకు అందుబాటులో ఉందని.. వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానించడం, పని చేస్తున్న మీటర్లను బిగించుకొని ఉచిత తాగునీటిని పొందవచ్చన్నారు.

గ్రేటర్‌ పరిధిలో 20 వేల ఉచిత నీటి పథకానికి ఇంకా అవకాశం ఉందని జలమండలి ఎండీ దానకిశోర్‌ స్పష్టం చేశారు. అయితే అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌ ఓనర్లందరూ క్యాన్‌ నంబర్‌తో ఆధార్‌ను అనుసంధానించుకుంటేనే పథకం వర్తిస్తుందని చెప్పారు. మంగళవారం నగర ప్రజలకు బహిరంగ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత నీటి పథకం అర్హతలు, అనర్హతలను వివరించారు.

4 నెలలు గడువు…

- Advertisement -

ఉచిత నీటిని పొందేందుకు ప్రభుత్వం సుమారు 4 నెలల గడువు ఇచ్చింది. 2021 జూన్‌ 14వ తేదీ నాటికి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు కింద ఉన్న మొత్తం 9,73,977 కనెక్షన్లలో 41శాతం అంటే సుమారు 4,06,508 మంది వినియోగదారులు కనెక్షన్‌ తీసుకోవడంతో పాటు మీటర్లను బిగించుకొని క్యాన్‌ నంబర్ల ఆధారంగా లింకేజ్‌ చేసుకున్నారు. తద్వారా ఈ పథకం కింద సుమారు 8.24 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి.

రిజిస్ట్రేషన్‌ కోసం బోర్డు తీసుకున్న చర్యలు

మీటర్‌ బిగింపు ప్రక్రియను సులభతరం చేయడానికి 14 ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ డివిజన్లలో ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. వివరాలన్నీ ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో నమోదు చేయడంతో పాటు పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను సులభంగా బిగించుకునే వెసులుబాటు కల్పించింది. డేటాబేస్డ్‌ మీటర్‌ రీడింగ్‌ వివరాలను రికార్డు చేయడానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌ను సిద్ధం చేసింది. డొమెస్టిక్‌ వినియోగదారులు, బహుళ అంతస్తుల్లో నివసిస్తున్న వినియోగదారులు, వివిధ కాలనీల్లో నివసిస్తున్న వారికి బయోమెట్రిక్‌ విధానంతో పాటు, మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటింటికి జలమండలి సిబ్బంది వెళ్లి ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ విషయంలో ప్రజల సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు 155313 కస్టమర్‌ కేర్‌ నంబర్‌ ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యాలయంలో కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ను 30 లైన్లతో ఏర్పాటు చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేపట్టినప్పటికీ ఇంకా కొందరిలో ఉన్న సందేహాలను తీర్చేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు వాటర్‌ బోర్డు ఎండీ దానకిశోర్‌ తెలిపారు.

వినియోగదారుల సందేహాలకు సమాధానాలు

 • 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకం కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లు గానీ, మున్సిపాలిటీలకు గానీ వర్తించదు.
 • ఆధార్‌, క్యాన్‌ నంబర్‌ అనుసంధానం జరిగినా.. బిల్లులు వస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే.. వినియోగదారులకు సంబంధించిన మీటర్లు పనిచేయని పక్షంలో పథకం వర్తించబోదు.
 • బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్స్‌లు, వివిధ కాలనీల్లో నివసిస్తున్న అన్ని ఫ్లాట్లకు ఆధార్‌ తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందే. కొంతమంది చేసుకొని, మరి కొంతమంది ఆధార్‌ లింక్‌ చేసుకోకుంటే బిల్లు తప్పనిసరిగా వస్తుంది. ఆధార్‌ అనుసంధానం కోసం జలమండలి కస్టమర్‌ కేర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.
 • మీటర్లకు ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం కోసం 2021 ఏప్రిల్‌ 30 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గడువు దాటిన తర్వాత నుంచి అన్ని కనెక్షన్లకు ఒకేసారి బిల్లులు జారీ చేశారు. అర్హత కలిగిన కనెక్షన్లకు రిబేటు వర్తింపజేస్తూ నెలకు సగటు మీటర్‌ రీడింగ్‌ ప్రకారం బిల్లులు జారీ చేశారు. ఎలాంటి జరిమానాలు గానీ, వడ్డీ కానీ విధించలేదు.
 • గడువులోపు అనుసంధానం పూర్తయిన వారికి 2020 డిసెంబర్‌ 1 నుంచి ఏప్రిల్‌ 2021 వరకు రిబేటు ఇచ్చారు. మే 1 తర్వాత ఆధార్‌ లింక్‌ చేసుకున్న కనెక్షన్లకు, డిసెంబర్‌ నుండి ఏప్రిల్‌ వరకు 5 నెలల బిల్లు జారీ చేశారు. మే 1 నుంచి వారికి నెలవారీ బిల్లులు కూడా జారీ చేస్తున్నారు.
 • ఉచిత నీటి పథకం ఇప్పటికీ వర్తిస్తుంది. పనిచేస్తున్న మీటర్లతో క్యాన్‌ నంబర్లను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా రిబేటు ఇస్తారు.
 • ఒక వినియోగదారుడు తమ ఆధార్‌ నంబర్‌తో ఒక క్యాన్‌కు మాత్రమే లింక్‌ చేసుకోవాలి.
 • జీహెచ్‌ఎంసీ ఆక్యూపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) సమర్పించని వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు.

ఉచిత నీటి పథకం కోసం జలమండలి మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు hmwssb 20 kl ఉచిత నీటి రిజిస్ట్రేషన్‌. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించి వినియోగదారులు తమ ఆధార్‌ నంబర్లను వారి క్యాన్‌తో అనుసంధానించడం ద్వారా ఉచిత నీటి సరఫరా కోసం నమోదు చేసుకోవచ్చు. ఫింగర్‌ ప్రింట్‌, స్కానర్ల వివరాలు కూడా మొబైల్‌ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం వర్తించే విషయంలో ఎలాంటి అనుమానాలున్నా 155313 కస్టమర్‌ కేర్‌ నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉచితానికి.. ఇంకా అవకాశం
ఉచితానికి.. ఇంకా అవకాశం
ఉచితానికి.. ఇంకా అవకాశం

ట్రెండింగ్‌

Advertisement