e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home హైదరాబాద్‌ జలమండలి అప్రమత్తం

జలమండలి అప్రమత్తం

జలమండలి అప్రమత్తం
  • మ్యాన్‌హోళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
  • అత్యవసర బృందాల ఏర్పాటు

జంటనగరాల్లో వర్షాకాలంలో తలెత్తనున్న ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు జలమండలి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తాగునీటితోపాటు సీవరేజీ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎండీ దాన కిశోర్‌ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో జలమండలి రిజర్వాయర్‌ ప్రాంతాలు, జలమండలి కార్యాలయాల్లోను, సీవరేజీ ప్రాంతాల్లోనూ సోడియం హైపోక్లోరైట్‌ రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. డ్రైనేజీ ఓవర్‌ ఫ్లో, కలుషిత నీటిపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, కరోనా నేపథ్యంలో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నీరు నిలిచే ప్రాంతాలపై నిఘా

  • నగరంలో ప్రధానంగా నీళ్లు నిలిచే ప్రాంతాలపై జలమండలి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
  • త్వరలో జలమండలి సీవరేజీ అధికారులతోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
  • ప్రధానంగా 200-250 ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రధాన ప్రాంతాలపై అధికారులు నజర్‌ పెట్టారు.
  • మ్యాన్‌ హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ను బిగించడంతోపాటు వరదనీటిని నేరుగా నాలాల్లోకి పంపేందుకు ప్రత్యేక బృందాలను జలమండలి నియమించింది.
  • మ్యాన్‌హోళ్ల నిర్వహణ సక్రమం చేయాలని, ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా మాన్సూన్‌ ప్లాన్‌లో భాగంగా ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.
  • మ్యాన్‌హోళ్లు తెరిచి ఉంటే జలమండలి టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జలమండలి అప్రమత్తం

ట్రెండింగ్‌

Advertisement