e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home హైదరాబాద్‌ అన్ని వార్డుల్లో హాట్‌ స్పాట్స్‌ గుర్తించండి

అన్ని వార్డుల్లో హాట్‌ స్పాట్స్‌ గుర్తించండి

  • అధికారులతో జలమండలి ఎండీ దానకిశోర్‌ సమీక్ష
  • వార్డుల వారీగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయండి
  • సరిపడా యంత్రాలు, సిబ్బంది ఉండేలా చూసుకోవాలని ఆదేశం

సిటీబ్యూరో, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): వచ్చే నెల (అక్టోబర్‌) 1వ తేదీ జీహెచ్‌ఎంసీలోని శివారు మున్సిపాలిటీల సీవరేజి నిర్వహణ బాధ్యతలు జలమండలి తీసుకోనున్న నేపథ్యంలో ఇందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకుంటోంది. ఇందులో భాగంగా సోమ వారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శివారు మున్సిపాలిటీల పరిధిలోని జలమండలి సీజీఎం, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతో ఎండీ దాన కిశోర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీవరేజి నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను ఎండీ అధికారులకు వివరించారు. జలమండలి సీవరేజి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్న 66 వార్డుల పరిధిలోని అధికారులు వెంటనే వార్డుల వారీగా తరచు మురుగు పొంగే హాట్‌ స్పాట్‌లను గుర్తించాలని దానకిశోర్‌ ఆదేశించారు. ప్రతి మేనేజర్‌ వార్డు వారీగా ఒక ఫిర్యాదుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

వార్డుల వారీగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయండి

సీవరేజి సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు జలమండలి కస్టమర్‌ కేర్‌ 155313తో పాటు వార్డుల వారీగా ప్రత్యేక మొబైల్‌ నెంబర్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎండీ పేరొన్నారు. సీవరేజి సమస్యలపై సమాచార లోపం లేకుండా వార్డుల వారీగా సీజీఎంలు, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, కార్పొరేటర్లు, మేనేజర్లతో ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. సీవరేజి సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిషారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

నిర్వహణ సామగ్రిని జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకోండి

- Advertisement -

సీవరేజి నిర్వహణ చేపట్టనున్న 66 వార్డులకు సంబంధించి కావాల్సిన సామగ్రి, యంత్రాలు, కార్మికులను జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఎండీ సూచించారు. ప్రస్తుతం వర్షాలు ఎకువగా కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆపరేషన్స్‌ డైరెక్టర్‌-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement