e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి

హెచ్‌ఎండీఏలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి

హెచ్‌ఎండీఏలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి
  • ప్రతిరోజు 50 శాతం మంది ఉద్యోగులు వచ్చేలా ఆదేశాలు
  • కొవిడ్‌ నేపథ్యంలో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనూ ప్ర భుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో వివిధ విభాగా ల్లో రెండువేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్సు లో ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయానికి నగరం నలుమూలల నుంచి ఉద్యోగులతో పాటు ప్రజలు వివిధ పనుల నిమిత్తం విచ్చేస్తుంటారు. కోర్‌ సిటీ లో ఉన్న కార్యాలయానికి వచ్చి వెళ్లాలంలేనే హెచ్‌ఎండీఏ ఉద్యోగులు కరోనాతో భయాందోళనలకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ఉద్యోగులకు కొవిడ్‌ టీకాలను మూడు రోజుల పాటు ఇప్పించారు. సుమారు 600 మంది వరకు టీకాలు తీసుకున్నారని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

50 శాతం మంది విధులకు హాజరు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ తర్వాత ఎంతో కీలకమైన ప్రభుత్వ కార్యాలయం గా ఉన్న హెచ్‌ఎండీఏలో సుమారు 2500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌, ప్రణాళికా విభాగం, అర్బన్‌ ఫారెస్ట్‌, లేక్స్‌ డివిజన్‌, ప్రాజెక్ట్‌, రెవెన్యూ, ఔటర్‌ రింగు రోడ్డు, ఎస్టేట్స్‌ విభాగాలలో చాలా మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం, కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు అందరూ ఒకేసారి విధులకు హాజరు కాకుండా ఒక రోజు 50 శాతం మంది, మరుసటి రోజు మిగతా 50 శాతం మంది ఉద్యోగుల చొప్పున విధులకు రావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశా రు. అదే విధంగా అమీర్‌పేట స్వర్ణ జయంతి కాంప్లెక్సులో 2, 4, 5, 7 అంతస్థుల్లో విభాగాల వారీగా ఉన్న కార్యాలయంలోకి ప్రజలను ఒకేసారి అనుమతించకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. అత్యవసర పనుల నిమిత్తం వస్తున్న వారిని రద్దీ లేని సమయాల్లో అనుమతించి, ఉద్యోగులు కరోనా బారిన పడకుండా విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెచ్‌ఎండీఏలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి

ట్రెండింగ్‌

Advertisement