శ్రీనగర్ కాలనీ, ఆగస్టు 17: హెచ్ఐసీసీ నోవాటెల్లో ఈ నెల 29, 30వ తేదీల్లో హై లైఫ్ ఫ్యాషన్, లైఫ్ ైస్టెయిల్ వస్త్ర ప్రదర్శనను నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ రోడ్డు -10లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో హై లైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ను నటి అనన్య, మోడల్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి అనన్య మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన హై లైఫ్ ఎగ్జిబిషన్లో వివాహ, ఆభరణ, వస్ర్తాల ప్రదర్శనతో పాటు నవీన శైలిలో రూపొందించిన వస్ర్తాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించే వస్ర్తాలను విక్రయించనున్నారని వెల్లడించారు. 29, 30వ తేదీల్లో నిర్వహించే ప్రదర్శన అవకాశాన్ని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు అగ్రశ్రేణి డిజైనర్లు తయారు చేసిన ఆభరణాలు, దుస్తులను ధరించి మోడల్స్ హొయలు ఒలికించారు.