బుధవారం 24 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 27, 2021 , 05:38:12

బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి

బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి

కమర్షియల్‌ కోర్ట్‌ ప్రారంభోత్సవంలో హై కోర్ట్‌ న్యాయమూర్తి ఎం.ఎస్‌ రామచంద్రరావు

చార్మినార్ : కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని హై కోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్‌ రామచంద్రరావు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత నగరంలోని సిటీ సివిల్‌ కోర్టు ప్రాంగణంలో ఆయన కమర్షియల్‌ కోర్ట్టును డిజిటల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కోర్టులను ఆశ్రయించే వారికి తగిన న్యాయం జరిగేలా జ్యుడీషియల్‌ సిబ్బంది ప్రయత్నించాలన్నారు. కేసులను వేగవంతంగా విచారణ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా బాధితులకు న్యాయం అందించాలన్నారు. అనంతరం సిటీ సివిల్‌ కోర్టు మూసివేత వల్ల న్యాయవాదులు, కక్షిదారులు న్యాయ సహాయాన్ని పొందడానికి ఇబ్బందులకు గురవుతున్నారని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి సి.సుమలత దృష్టికి తీసుకువచ్చారు. సాధ్యసాధ్యాలను పరిశీలించి కోర్టుల పునః ప్రారంభానికి ఆదేశాలు అందించాలని విన్నవించారు. కార్యక్రమంలో సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి సుమలతతో పాటు రంగారెడ్డి జిల్లా కోర్టు చీఫ్‌ జడ్జి డాక్టర్‌ రాధారాణి, న్యాయమూర్తి ఏ.రాజశేఖర్‌రెడ్డి, పట్టాభి రామారావు, సిటీ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాండయ్య, అన్నపూర్ణ, జానకిరాముడు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo