కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు

హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని కాముని చెరువు సుందరీకరణ పనులపై స్టేటస్కో (యథాతథస్థితి) ఆదేశాలను పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్పల్లి, మూసాపేటలో విస్తరించి ఉన్న కాముని చెరువు భూములను రక్షించాలని హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. కూకట్పల్లి ఏరియా డెవలప్మెంట్ సొసైటీ, కార్పొరేటర్ పి. కావ్యరెడ్డి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. అలాగే..సుందరీకరణ పనుల పేరుతో తమ సొసైటీ సభ్యుల ఇండ్లను తొలిగించారని పేర్కొంటూ రాఘవేంద్ర వీకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది. ఒకే విషయంపై ఎక్కువ సంఖ్యలో వ్యాజ్యాలు ఉండటం ఎందుకని ప్రశ్నించిన ధర్మాసనం.. కార్పొరేటర్ కావ్యరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను మూసేసింది.
కూకట్పల్లి ఏరియా డెవలప్మెంట్ సొసైటీ దాఖలు చేసిన పిల్‌ను ఏప్రిల్ 26కు వాయిదా వేసింది. మరో పిటిషనర్ రాఘవేంద్ర వీకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. అభివృద్ధి పేరిట తమ కాలనీ స్థలంలో ఉన్న ఇండ్లను కూలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పర్షద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ భూముల్లోనే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ భూవివాదానికి సం బంధించి సింగిల్ జడ్జి వద్ద ఇదే తరహా వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నందున.. అక్కడే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని రాఘవేంద్ర వీకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పై ఆదేశాలతో వ్యాజ్యాలను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ అంగీకరించడంతో రెండు వ్యా జ్యాలను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సుందరీకరణ పనులు చేపడుతున్న ప్రైవేటు ప్రతివాది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు