e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home హైదరాబాద్‌ 3 స్లాబుల్లో పెంపు

3 స్లాబుల్లో పెంపు

3 స్లాబుల్లో పెంపు
 • భూములతో పాటు భవనాలకూ వర్తింపు
 • 30,40,50 % చొప్పున పెరుగుదల
 • రేపటి నుంచి అమల్లోకి నూతన ధరలు
 • నగరంలో స్థలాలు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లకు క్రేజ్‌

సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) ః రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో బాగంగానే హైదరాబాద్‌ మహానగర సంస్థ పరిధిలో కూడా భూముల విలువలతో పాటు స్టాంపు డ్యూటీని 6శాతం నుంచి 7.5శాతంకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించి సెంట్రల్‌ సర్వర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నా.. కూడా పెరిగిన ధరలు వర్తిస్తాయి. అలాగే ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ. 100 నుంచి రూ. 200లకు పెంచిన ప్రభుత్వం..స్లాబుల వారీగా 50శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ విలువలను పెంచినట్లు ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి పెంచగా..చదరపు అడుగుపై 20శాతం, 30శాతం లెక్కన పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఓపెన్‌ ప్లాట్ల విలువ ఇలా..

 • జీహెచ్‌ఎంసీ పరిధిలో కనిష్ఠ ధరను చదరపు గజానికిరూ.2వేలుగా ఉంటే దానినిరూ.3వేలకు పెంచారు.
 • చదరపు గజానికి రూ.10వేల వరకు ఉన్న వాటిపై ప్రస్తుతం ఉన్న విలువపై 50 శాతాన్ని పెంచారు.
 • చదరపు గజానికి రూ.10-20వేల వరకు ఉన్న వాటిపై కనిష్ఠంగా రూ.15వేలతో మొదలై ప్రస్తుతం ఉన్న విలువపై 40 శాతాన్ని పెంచారు.
 • చదరపు గజానికి రూ.20వేల కంటే ఎక్కువ విలువ ఉన్న వాటిపై కనిష్ఠంగా రూ.28వేలతో మొదలై ప్రస్తుతం ఉన్న విలువపై 30 శాతాన్ని పెంచారు.

హెచ్‌ఎండీఏ ఏరియా-1

 • (జీహెచ్‌ఎంసీ అవతల-రంగారెడ్డి,మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి,సంగారెడ్డి పాక్షికం) పరిధిలో
 • కనిష్ఠ విలువ చదరపు గజానికి రూ.1000 నుంచి రూ.1500 పెంచారు.
 • చదరపు గజం 10వేల వరకు ఉంటే దానిలో 50 శాతం పెంచారు. అంటే రూ.10వేల గజం ఉంటే ఇప్పుడు రూ.15వేలు అయింది.
 • చదరపు గజం రూ.10-20వేల వరకు ఉంటే కనిష్ఠంగా రూ.15వేలతో మొదలై ప్రస్తుతం ఉన్న విలువపై 40 శాతం పెంచారు.
 • చదరపు గజం రూ.20వేలు దాటితే… కనిష్ఠంగా రూ.28వేలతో మొదలై ప్రస్తుతం విలువ ఉన్న విలువపై 30 శాతం పెంచారు.

హెచ్‌ఎండీఏ ఏరియా-2

 • (జీహెచ్‌ఎంసీ అవతల-సిద్దిపేట, మెదక్‌, ఇతర ప్రాంతాలు) పరిధిలో
 • చదరపు గజం విలువ కనిష్ఠంగా
 • రూ.500 ఉంటే దానిని రూ.800 పెంచారు.
 • చదరపు గజం రూ.1000 వరకు ఉన్న వాటిపై గజం విలువ రూ.800తో మొదలై ప్రస్తుతం ఉన్న
 • విలువపై 50 శాతాన్ని పెంచారు.
 • చదరపు గజం రూ.10-20వేల వరకు ఉన్న కనిష్ఠంగా రూ.15వేలతో మొదలై ప్రస్తుతం ఉన్న విలువపై 40 శాతాన్ని పెంచారు.
 • చదరపు గజం రూ.20వేలు దాటితే కనిష్ఠంగా రూ.28వేలతో మొదలై ప్రస్తుతం ఉన్న విలువపై 30 శాతాన్ని పెంచారు.

హెచ్‌ఎండీఏ ఏరియా-1

 • (రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి, సంగారెడ్డి పాక్షికం) పరిధిలో
 • ప్రస్తుతం ఎకరా కనిష్ఠ విలువ రూ.3.35 లక్షలు ఉండగా దానిని 5 లక్షలకు పెంచారు.
 • ఎకరా రూ.3,35,001 – రూ.10 లక్షల మధ్య విలువ ఉన్న వాటిపై 50 శాతాన్ని పెంచారు.
 • ఎకరా రూ.10,00,001 నుంచి రూ.కోటి మధ్య విలువ ఉన్న వాటిపై 40 శాతాన్ని పెంచారు. అయితే ఇక్కడ కనిష్ట విలువను రూ.15 లక్షలుగా తీసుకుంటారు.
 • ఎకరా రూ.కోటికి మించి మార్కెట్‌ విలువ ఉన్న వాటిపై30 శాతాన్ని పెంచారు. ఇక్కడ కనిష్ఠ విలువనురూ.1.40 కోట్లుగా తీసుకుంటారు.
 • హెచ్‌ఎండీఏ ఏరియా-2 (సిద్దిపేట, మెదక్‌, ఇతర ప్రాంతాలు)
 • ఎకరా ధర కనిష్ఠంగా రూ.2 లక్షలు ఉండగా దానిని రూ.3 లక్షలకు పెంచారు.
 • ఎకరా రూ.2,00,001 0 రూ.పది లక్షల మధ్య విలువ ఉన్న వాటిపై 50 శాతాన్ని పెంచారు.
 • ఎకరా రూ.10,00,001 నుంచి రూ.కోటి మధ్య విలువ ఉన్న వాటిపై 40 శాతాన్ని పెంచారు. ఇక్కడ కనిష్ఠ విలువను రూ.15 లక్షలుగా తీసుకుంటారు.
 • ఎకరా రూ.కోటికి మించి మార్కెట్‌ విలువ ఉన్న వాటిపై 30 శాతాన్ని పెంచారు. ఇక్కడ కనిష్ఠ విలువను రూ.1.40 కోట్లుగా తీసుకుంటారు.

ఏ ఏ చార్జీలు పెరుగుతాయంటే..

 • భూముల విలువ
 • రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు
 • విక్రయ అగ్రిమెంట్‌/జీపీఏ
 • డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌
 • జీపీఏ
 • డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌
 • కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు,
 • కుటుంబ, కుటుంబేతరుల
 • మధ్య ఒప్పందాలు,
 • బహుమతి (గిఫ్ట్‌),
 • టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌,
 • జీపీఏ (అథరైజేషన్‌తో,
 • అథరైజేషన్‌ లేకుండా),
 • వీలునామా, లీజు, ఇతర సేవల ఛార్జీలు
 • అపార్టుమెంట్లు.. ఫ్లాట్లు..

హెచ్‌ఎండీఏ (జీహెచ్‌ఎంసీ అవతల) పరిధిలో

 • ప్రస్తుతం చదరపు మీటరుకు కనిష్ఠ ధర రూ.1500 ఉంటే దానిని రూ.1700 పెంచారు.
 • చదరపు మీటరుకు రూ.4వేల వరకు ఉన్న వాటిపై 20 శాతాన్ని పెంచారు.
 • చదరపు మీటరు రూ.4వేల కంటే ఎక్కువ విలువ ఉన్న వాటిపై 30 శాతాన్ని పెంచారు.

జీహెచ్‌ఎంసీపరిధిలో

 • అపార్టుమెంట్లలోఫ్లాట్ల కనిష్ఠ ధరచ.మీటరుకు రూ.1700 ఉండగా దానినిరూ.2వేలకు పెంచారు.
 • చదరపు మీటరుకు రూ.4వేల వరకు వాటిపై 20 శాతాన్ని పెంచారు.
 • చదరపు మీటరుకు రూ.4వేలకు మించి విలువ ఉన్న వాటిపై 30 శాతాన్ని పెంచారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
3 స్లాబుల్లో పెంపు
3 స్లాబుల్లో పెంపు
3 స్లాబుల్లో పెంపు

ట్రెండింగ్‌

Advertisement