శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 22, 2020 , 03:01:14

అల్‌ ఖైదాకు ఆర్థిక సహాయం

అల్‌ ఖైదాకు ఆర్థిక సహాయం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అమెరికాలో ఉంటూ తీవ్రవాద సంస్థ అల్‌ ఖైదాకు ఆర్థిక సహాయం చేసిన కేసులో ఉన్న జుబేర్‌ అహ్మద్‌ మూలాలు హైదరాబాద్‌ అల్వాల్‌ ప్రాంతానికి చెందినవిగా తేలింది. 2018లో అమెరికా కోర్టు విచారణలో జుబేర్‌ తాను అల్‌ఖైదాకు ఆర్థిక సహాయం చేసినట్లు ఒప్పుకున్నాడు. జుబేర్‌తో పాటు ఆసిఫ్‌ అహ్మద్‌ సలీం, సుల్తానే సలీం కూడా వారు చేసిన తప్పును ఒప్పకున్నారు. తా జాగా జుబేర్‌ అహ్మద్‌ను అమెరికా బుధవారం భారత దేశానికి డిపోర్ట్‌ చేసింది. ప్రస్తుతం అతను అమృత్‌సర్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు. 1990లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన జుబేర్‌  అమెరికాకు వెళ్లి,  అక్కడే ఆ దేశస్థురాలిని వివాహం చేసుకున్నాడు. ఈ సమయంలోనే  అల్‌ఖైదా నాయకుడు అన్వర్‌ అల్‌ అవ్లాక్‌కు జుబేర్‌ జీహాదీ కోసం యువతను ఆకర్షించేందుకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించడంతో పాటు పలు బ్లాగ్‌లను నిర్వహించాడు. ఈ కుట్రను పసిగట్టిన అమెరికా పోలీసులు జుబేర్‌తో పాటు ఆసిఫ్‌ అహ్మద్‌, సుల్తానే సలీంను అరెస్టు చేశారు. జుబేర్‌ తల్లిదండ్రులు హైదరాబాద్‌ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన వారని నిఘా వర్గాలు గుర్తించాయి. జుబేర్‌ టోలిచౌకీ పారామౌంట్‌ కాలనీలో నివాసముంటూ బంజారాహిల్స్‌లోని ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్‌ చదివాడు. పాస్‌పోర్టు సైతం హైదరాబాద్‌ చిరునామాతో ఉండడంతో అప్రమత్తమైన ఇక్కడి పోలీసులు వారి కుటుంబంపై నిఘా పెట్టారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న జుబేర్‌ను త్వరలోనే హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారించే అవకాశం ఉంది.


logo