శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 23, 2020 , 01:12:09

అగ్నిగుండంగా నగరం... 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అగ్నిగుండంగా నగరం... 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండడంతో  నగరం అగ్నిగుండంగా మారుతున్నది. దీనికి తోడు గాలిలో తేమ తక్కువగా ఉండడంతో వడగాలులు వీస్తున్నాయి. ఉక్కపోత ఎక్కువై జనం విలవిలలాడుతున్నారు.  శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో గరిష్ఠం 42.7, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.9 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 14 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


logo