హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 21.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తిరుమలగిరి, సికింద్రాబాద్, కూకట్పల్లి, అంబర్పేట్, హిమాయత్‌నగర్‌లో రాత్రంతా ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్, నాంపల్లి ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. పటాన్ చెరులో 41.1 మి.మీ. వర్షపాతం, గోల్కొండలో 37.3 వర్షపాతం నమోదైంది.
రాబోయే నాలుగైదు రోజుల వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు నగరంలో ఎండలు దంచికొట్టాయి. రాత్రంతా వర్షం కురియడంతో వాతావరణం చల్లబడింది. దీంతో నగర ప్రజలు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు.