మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 00:39:59

మళ్లీ హోరెత్తింది..

మళ్లీ హోరెత్తింది..

  • రెండోరోజు నగరంలో భారీ వర్షం
  • గురువారం అత్యధికంగా 7 సెంటీమీటర్లు
  • జలమయమైన లోతట్టు ప్రాంతాలు
  • మోకాళ్ల లోతు నిలిచిన నీటితో జనం బెంబేలు 
  • ఔటర్‌లో విరిగిపడిన కొండచరియలు
  • మూసీలో మొసలి కలకలం.. 
  • జాతీయ రహదారిపై కంగారు పెట్టిన కొండ చిలువ 
  • వాతావరణ శాఖ హెచ్చరికలతో బల్దియా హై అలర్ట్‌

హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావానికి తోడు ఉపరితల ద్రోణితో రెండురోజులుగా గ్రేటర్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కురిసిన కుండపోత వర్షానికి తడిసి ముైద్దెన నగరం.. గురువారం మళ్లీ జోరు వానతో జలమయమైంది. రాత్రి 8గంటల వరకు కూకట్‌పల్లిలోని బాలానగర్‌లో అత్యధికంగా 7.1సెం.మీల వర్షపాతం నమోదవ్వగా, మాదాపూర్‌లో అత్యల్పంగా 1.0 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠం  21.6 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 97 శాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులు గ్రేటర్‌ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. logo