శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 23, 2020 , 02:46:47

రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి

రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి

కవాడిగూడ : రాష్ర్టాన్ని సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు అన్నారు. దీనిలో భాగంగానే నగరంలోని పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని దోమలగూడ రోజ్‌కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను టి.పద్మారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముషీరాబాద్‌ నియోకవర్గంలో ఇప్పటికే ఐదు బస్తీదవాఖానలు కొనసాగుతున్నాయని ఇది ఆరవదని చెప్పారు. ప్రజల క్షేమం కోరే ప్రభుత్వం కాబట్టే నిరంతరం వారి యోగక్షేమాలు చూస్తున్నదన్నారు. బస్తీ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని అన్నారు.  ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 15 డీఎంసీ ఉమాప్రకాశ్‌, ఏఎంహెచ్‌ఓ హేమలత, డీపీవో రత్నరాణి, వైద్య అధికారులు డాక్టర్‌ సరళ, డాక్టర్‌ పద్మజ తదితరులు పాల్గొన్నారు.


logo