మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:35:58

హవాల డబ్బు రవాణా..

హవాల డబ్బు రవాణా..

వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు అరెస్ట్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వేర్వేరు ప్రాంతాల్లో హవాల డబ్బును తీసుకెళ్తున్న ఐదుగురిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు వారి నుంచి దాదాపు రూ.48లక్షలను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మనీష్‌ తోష్నివాల్‌  హైదరాబాద్‌కు  వచ్చి..హవాల దందా నిర్వహిస్తున్నాడు.  ఇందుకు శాలిబండకు చెందిన విష్ణు బిరదర్‌ను ఏజెంట్‌గా నియమించుకొని అవసరమైన వారికి కమీషన్‌ పద్ధతిలో హవాల డ బ్బు పంపిణీ చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో గురువారం సాయంత్రం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు బృం దం సుల్తాన్‌బజార్‌లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హోండా యాక్టివాలో ఉన్న రూ. 31,25,100లను స్వాధీనం చేసుకొని, ఆ డబ్బులకు సంబంధించి లెక్కలు అడుగగా సరైన సమాధానాలు చెప్పలేదు.  తదుపరి విచారణకు ఈ కేసును సుల్తాన్‌బజార్‌ పోలీసులకు అప్పగించారు.

సికింద్రాబాద్‌లో ముగ్గురు...

రాజస్థాన్‌కు చెందిన నాయి లలిత్‌కుమా ర్‌ చునీలాల్‌, అశోక్‌ సింగ్‌లు బేగంబజార్‌లో నివాసముంటారు. వీరు నగరంలో హవాల దందా నిర్వహిస్తున్నారు. రూ.లక్షకు 5శాతం కమీషన్‌ తీసుకొని.. హవాల డబ్బును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి  తరలిస్తుంటారు. శుక్రవారం వారిద్దరు హవాల డబ్బును తీసుకొని ఉప్పల్‌కు చెందిన నారెడ్డి లక్ష్మికాంత్‌రెడ్డి అనే వ్యాపారికి ఇవ్వడానికి  సికింద్రాబాద్‌లో సిటీ లైట్‌ హోటల్‌ వద్దకు వెళ్లారు. అక్కడ డబ్బులు ఇస్తుండగా .. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 16,69,700లు, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. 

కారులో 14.96 లక్షలు తరలింపు: పట్టుకున్న పోలీసులు

హిమాయత్‌నగర్‌: సరైన పత్రాలు లేకుం డా నగదును తీసుకువెళ్తున్న ఓ వ్యక్తిని సెం ట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం .. జూబ్లీహిల్స్‌కు చెందిన డాక్టర్‌ పి.శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి మెదక్‌ జిల్లా చేగుంటలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు.  శుక్రవారం  తన ఖాతా నుంచి రూ.14.96 లక్షలు డ్రా చేసుకుని... కూలీలకు ఇవ్వడానికి ఇన్నోవాలో బయలుదేరాడు. కారులో నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  హైదర్‌గూడలో ఆ కారును ఆపి తనిఖీ చేయ గా రూ.14.96 లక్షలు లభించాయి. వీటికి సరైన పత్రాలులేని కారణంగా శ్రవణ్‌ కుమార్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని   నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.