e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 16, 2021
Advertisement
Home హైదరాబాద్‌ బూతు వీడియోలకు అలవాటై యువతికి వేధింపులు

బూతు వీడియోలకు అలవాటై యువతికి వేధింపులు

బూతు వీడియోలకు అలవాటై యువతికి వేధింపులు

అశ్లీల వెబ్‌సైట్‌లలో ఫోన్‌ నంబర్‌ పెడుతానని బ్లాక్‌మెయిల్‌ చేసిన ఓ యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కృష్ణ జిల్లా పామురు మండలానికి చెందిన సోమసుందర సాయి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. సోమసుందర్‌ సాయి బూతు వీడియోలు చూడటానికి బానిసయ్యాడు. ఇన్‌స్టాగ్రాంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువతిని వీడియో కాల్‌ ద్వారా నగ్నంగా మాట్లాడాలని బెదిరించగా.. ఆ యువతి అతన్ని బ్లాక్‌ చేసింది. దీనిపై కోపం పెంచుకుని మహిళ పేరు మీద మరో ఇన్‌స్టాగ్రాం ఐడీ సృష్టించి యువతితో మాట్లాడాడు. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడాలని వేధించాడు. దీనికి యువతి స్పందించకపోవడంతో అతని నగ్న వీడియోను పంపి ఇబ్బంది పెట్టాడు. దీంతో యువతి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు సోమసుందర్‌ సాయిని అరెస్టు చేశారు. వేధింపులకు వాడిన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
బూతు వీడియోలకు అలవాటై యువతికి వేధింపులు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement